ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈపీఎఫ్‌ఓ... ఫిబ్రవరిలో 12.37 లక్షల కొత్త ఖాతాదారులు...

ABN, First Publish Date - 2021-04-21T21:20:30+05:30

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో ఫిబ్రవరి నెలలో కొత్తగా 12.37 లక్షల మంది చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో ఫిబ్రవరి నెలలో కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. కిందటి సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఇది ఇరవై శాతం అధికం. కరోనా నేపధ్యంలో కూడా సంఘటిత రంగంలో ఉపాధి పెరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది  జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో నికర వినియోగదారులు 3.52 శాతం మేర పెరిగారు. 


కిందటి ఆర్థిక సంవత్సరంలో నికరంగా 69.58 లక్షల మంది ఖాతాదారులు అదనంగా చేరారు. కాగా... ఉద్యోగాలు మారిన నేపధ్యంలో మొత్తం 4.81 లక్షలమంది సభ్యులు... ఈపీఎఫ్ఓ నుండి నిష్క్రమించి మళ్లీ చేరారు. తుది పరిష్కారానికి బదులు నిధుల బదిలీ చేసుకొని సభ్యత్వాలను అట్టేపెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 22-25 సంవత్సరాల మధ్య వయసు వారు 3.29 లక్షల మంది, 29-35 ఏళ్ల వారు 2.51 లక్షల మంది చేరారు. నిపుణుల సేవల విభాగంలో 4.99 లక్షల మంది, ట్రేడింగ్ వాణిజ్య సంస్థల విభాగంలో 84 వేల మంది చేరారు. హర్యానా, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర,  కర్ణాటక రాష్ట్రాలు నికర నమోదులో ముందున్నాయి. ఈ అయిదు రాష్ట్రాలు కలిపి మొత్తం నికర ఖాతాదారుల నమోదులో 54.81 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఫిబ్రవరిలో నమోదైన నికర ఖాతాదారుల్లో 21 శాతం వాటా మహిళలది కావడం విశేషం. 

Updated Date - 2021-04-21T21:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising