ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీఐసీఐ బ్యాంక్ ఛర్జీల పెంపు... అమల్లోకి

ABN, First Publish Date - 2021-08-01T21:59:28+05:30

ఐసీఐసీఐ బ్యాంక్ పలు సర్వీసులకు సంబంధించిన చార్జీలను సవరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్ పలు సర్వీసులకు సంబంధించిన చార్జీలను సవరించింది. ఈ రోజు(ఆగస్టు ఒకటి) నుంచే ఈ కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. వివనాలిలా ఉన్నాయి. బ్యాంక్ కస్టమర్లు అదనపు చెక్ బుక్ పొందాలంటే ఫీజు చెల్లించుకోవాలి. ఒక ఏడాదిలో 25 చెక్కులతో కూడిన చెక్ బుక్ ఉచితంగా పొందొచ్చు. ఈ లిమిట్ దాటితే 10 చెక్కులతో కూడిన ప్రతి చెక్ బుక్‌కు రూ. 20 చొప్పున చెల్లించుకోవాలి.


నగదు ఉపసంహరణలు...

ఈ రోజు(ఆగస్టు ఒకటి) నుంచి నెలలో తొలి నాలుగు నగదు ుపసంహరణలపై ఎటువంటి చార్జీలూ ఉండబోవు. ఆ తర్వాత మాత్రం... రూ. వెయ్యి విత్‌డ్రాయల్ పై రూ. 5 చార్జీ చెల్లింపుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా రూ. లక్ష వరకు చార్జీలు లేకుండా పొందవచ్చు. లిమిట్ దాటితే మాత్రం గరిష్టంగా రూ. 150 వరకు చార్జీ పడుతుంది. హోమ్ బ్రాంచ్‌కు ఈ చార్జీలు వర్తిస్తాయి. అదే నాన్ హోమ్ బ్రాంచ్‌లో అయితే రోజుకు రూ. 25 వేల వరకు తీసుకోవచ్చు. చార్జీలు ఉండవు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న చార్జీలు పడతాయి.


ఏటీఎం లావాదేవీలు... 

నెలలో తొలి మూడు లావాదేవీలకు(నాన్ బ్యాంక్ ఏటీఎం) సంబంధించి ఛార్జీలుండవు. మెట్రో నగరాలకు ఇది వర్తిస్తుంది. ఈ లిమిట్ దాటితే ఒక్కో లావాదేవీకి రూ. 20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ. 8.5 చొప్పున చెల్లించుకోవాలి. ఇతర ప్రాంతాల్లోనైతే... ఐదు లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. చార్జీలుండవు. 

Updated Date - 2021-08-01T21:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising