ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాకేష్ విమాన ప్రాజెక్టులో భాగస్వామినవుతా.... ఇండిగో ఎయిర్‌లైన్స్ మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్

ABN, First Publish Date - 2021-07-30T01:30:01+05:30

తక్కువ వ్యయంతోనే విమానాల్లో ప్రయాణించేందుకుగాను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా చేపట్టిన ప్రాజెక్టులో భాగస్వామినవుతానని ఇండిగో ఎయిర్ లైన్స్ మాజీ ప్రెసిడెంట్, పూర్తి స్థాయి డైరెక్టర్ ఆదిత్య ఘోష్ ప్రకటించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : తక్కువ వ్యయంతోనే విమానాల్లో ప్రయాణించేందుకుగాను  స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా చేపట్టిన ప్రాజెక్టులో భాగస్వామినవుతానని ఇండిగో ఎయిర్ లైన్స్ మాజీ ప్రెసిడెంట్, పూర్తి స్థాయి డైరెక్టర్ ఆదిత్య ఘోష్ ప్రకటించారు. ‘ఆకాశ్ ఎయిర్’ పేరిట ప్రారంభం కానున్నట్లుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో... తాను సుమారు 40 శాతం... అంటే  35 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 260 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తానని రాకేష్ ఝంజువాలా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోర్డులో ఇతర డైరెక్టర్లు కూడా ఉంటారన్నారు. కాగా... 2018 లో ఆదిత్య ఘోష్ ఇండిగో పేరెంట్ కంపెనీ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ నుంచి వైదొలగిన నవిషయం తెలిసిందే. పదేళ్ల పాటు ఆయన ఇండిగో ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.ఆకాశ ఎయిర్ లైన్స్ లో తాను పది శాతం పెట్టుబడి పెడతానని ఆయన వెల్లడించారు.


దీంతో ఈ ప్రాజెక్టు బోర్డులో ఆయన కూడా సభ్యునిగా కొనసాగనున్నట్లు వినవస్తోంది.అయితే ‘యాజమాన్యం’లో మాత్రం  ఉండబోనని స్పష్టం చేయడం గమనార్హం. జెట్ ఎయిర్ వేస్ మాజీ బాస్ అయిన వినయ దూబే ఇందులో 15 శాతం మేర పెట్టుబడి పెట్టనున్నారు. ఆయన సీఈఓగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ చౌక ధర ఏవియేషన్ ప్రాజెక్టుకు అమెరికాకు చెందిన సన్ కంట్రీ ఎయిర్ లైన్స్, ఎయిర్ బీఎన్‌బీ కూడా ఇన్వెస్ట్ చేయనున్నాయి. కాగా... పెట్టుబడుల వివరాలు మాత్రం వెల్లడికాలేదు. తన ఎయిర్ లైన్ ప్రతిపాదనకు విమానయాన శాఖ నుంచి 15 రోజుల్లోగా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ వస్తుందని ఆశిస్తున్నట్టు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. సుమారు 70 విమానాలతో తమ ఎయిర్ లైన్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరో నాలుగేళ్లలో ఇది కార్యరూపం దాలుస్తుందని అయన వెల్లడించారు.

Updated Date - 2021-07-30T01:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising