మహిళలకు హైసియా మెంటరింగ్ సేవలు
ABN, First Publish Date - 2021-11-20T06:19:27+05:30
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేయడానికి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) వినూత్న వేదికను ప్రారంభించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేయడానికి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) వినూత్న వేదికను ప్రారంభించింది. బియాండ్ పింక్స్‌తో కలిసి ‘బియాండ్ మెంటరింగ్’ పేరుతో ఆన్‌లైన్ మెంటరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హైసియా ప్రెసిడెంట్ భరణి అరోల్ తెలిపారు. 25 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ సేవలందించేందుకు మొదటి కోహర్ట్‌ను శుక్రవారం ప్రారంభించారు.
Updated Date - 2021-11-20T06:19:27+05:30 IST