ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాప్‌రే... ఆయన వేతనం... రూ. 60 కోట్ల పైమాటే...

ABN, First Publish Date - 2021-06-14T02:43:02+05:30

టెక్ దిగ్గజ కంపెనీ విప్రో చీఫ్ థియరీ డెలాపోర్ట్ గతేడాది(అంటే 2021 ఆర్ధిక సంవత్సరం) 8.8 మిలియన్ డాలర్లను వేతనంగా అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : టెక్ దిగ్గజ కంపెనీ విప్రో చీఫ్ థియరీ డెలాపోర్ట్  గతేడాది(అంటే 2021 ఆర్ధిక సంవత్సరం) 8.8 మిలియన్ డాలర్లను వేతనంగా అందుకున్నారు. అంటే మన కరెన్సీలో ఇది రూ. 64 కోట్లు. సెబీకి ఇచ్చిన ఫైలింగ్ లో ఈ వివరాలను  ప్రకటించారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పోటీ సంస్థలలో వేతనాలు ఈ దరిదాపుల్లో కూడా లేవు. ఐటీలో అత్యధిక పారితోషికం పొందిన సీఈఓగా ఆయన వార్తల్లోకెక్కారు. 


కిందటి సంవత్సరం జూలై 6 న విప్రో సీఈఓ గా ఆయన  బాధ్యతలు తీసుకున్నారు కాగా... జూలై 6, 2020 నుండి మార్చి 31, 2021 వరకు ఆయనం భారీగా ది. ఇందులో వన్-టైమ్ క్యాష్ అవార్డు, వార్షిక స్టాక్ గ్రాంట్ మరియు ఆర్‌ఎస్‌యూ ల వన్-టైమ్ గ్రాంట్ వంటివి ఉన్నాయి. జూలై 2020 లో వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఆమోదించిన నిబంధనల మేరకు... జూన్ 10 న విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈయన వేతనం వివరాలు వెల్లడించింది. అంతకుముందు డెలాపోర్ట్... ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్ జెమినీ లో సీఈఓగా పని చేశారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ పే ప్యాకేజీ రూ . 49.68 కోట్లు కాగా, టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథ్ మొత్తం రూ . 20.3 కోట్లు అందుకున్నారు.

Updated Date - 2021-06-14T02:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising