ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం రూ.30 కోట్లు

ABN, First Publish Date - 2021-07-29T05:50:46+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ రూ.30.3 కోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ రూ.30.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.29.2 కోట్లు ఉంది. సమీక్షా త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం రూ.648 కోట్లు ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఎబిటా మార్జిన్‌ 8.7 శాతం నుంచి 8 శాతానికి తగ్గింది. వ్యాపార వాతావరణ అనుకూలంగా లేకపోయినా.. వ్యయాన్ని తగ్గించుకుంటూ.. లాభదాయకతను  పెంచుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని హెరిటేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా తెలిపారు.


సమీక్షా త్రైమాసికంలో రోజు వారీ పాల సేకరణ కూడా 14 లక్షల లీటర్ల నుంచి 12 లక్షల లీటర్లకు తగ్గింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో విలువ చేర్చిన ఉత్పత్తుల విక్రయాలు 11 శాతానికి పైగా పెరిగి రూ.175 కోట్లకు చేరాయి. ఈ కాలంలో 291 టన్నుల పెరుగును విక్రయించింది. కంపెనీ సీఈఓగా శ్రీదీప్‌ నాయర్‌ కేశవన్‌ను నియమించారు. ఇన్నోవేటివ్‌ మార్కెటర్‌గా ఆయనకు 20 ఏళ్ల అనుభవం ఉంది. 

Updated Date - 2021-07-29T05:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising