ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రూడాయిల్ ధర...భారీగా పెరిగింది...

ABN, First Publish Date - 2021-03-08T20:46:22+05:30

కరోనా నేపధ్యంలో గతేడాది కాలంగా భారీగా క్షీణించిన చమురు ధరలు క్రమంగా పుంజుకొని, పాతస్థాయికి చేరుకున్నాయి. క్రూడ్ ధరలు ఓ సమయంలో బ్యారెల్ 20 డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కరోనా నేపధ్యంలో గతేడాది కాలంగా భారీగా క్షీణించిన చమురు ధరలు క్రమంగా పుంజుకొని, పాతస్థాయికి చేరుకున్నాయి. క్రూడ్ ధరలు ఓ సమయంలో బ్యారెల్ 20 డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడంతో నిరుడు ఏప్రిల్ నుండి చమురు ధరలు తారస్థాయిలో పడిపోయిన విషయం తెలిసిందే. కాగా... గత కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా రికవరీ పుంజుకుంటుండటంతో క్రూడాయిల్ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు ఒపెక్ దేశాలు సహా చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం వల్ల కూడా ధరలు పెరగడానికి కారణమవుతోంది.


బ్రెంట్ క్రూడాయిల్ ధర ఈ రోజు(సోమవారం) రెండు శాతానికి పైగా పెరిగింది. కాగా... ఒక్కసారిగా ఇంతగా పెరగడానికి మరో కారణం కూడా ఉంది. సౌదీ ఆరామ్‌కో ఫెసిలిటీ పై మిస్సైల్ దాడి జరగడంతో ధరలు హఠాత్తుగా పెరిగాయి. మరోవైపు... ఈస్టర్న్ సౌద పోర్ట్ వద్ద డ్రోన్లు కదలాడాయి. ఇవి ఆరామ్‌కో ఫెసిలిటీ కేంద్రాలను టార్గెట్ చేశాయి. దీంతో ధరలు ఎగసిపడ్డాయి. రాస్ తనురా పోర్ట్, ఆరామ్‌కో రెసిడెన్షియల్ ప్రాంతంలో దాడులు జరిగినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.


Updated Date - 2021-03-08T20:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising