ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యూచువల్ ఫండ్స్‌లో... పెరిగిన సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లు...

ABN, First Publish Date - 2021-01-13T21:14:09+05:30

రుడు డిసెంబరులో ఈ రిజిస్ట్రేషన్లు 14.20 లక్షలకు పైగా పెరిగాయి. సిప్స్ పెరుగుదలలో కొన్ని సాంకేతికాంశాలు మెరుగైన పనితీరుకు దోహదం చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నిరుడు డిసెంబరులో ఈ రిజిస్ట్రేషన్లు 14.20 లక్షలకు పైగా పెరిగాయి. సిప్స్ పెరుగుదలలో కొన్ని సాంకేతికాంశాలు మెరుగైన పనితీరుకు దోహదం చేశాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త ఎస్‌ఐపీ పెరుగుదలతో పాటు పెట్టుబడులు కూడా భారీగాపెరగడం గమనార్హం.


కిందటి సంవత్సరం నవంబరులో 10.06 లక్షల సిప్స్ నమోదు కాగా, డిసెంబరులో 14.20 లక్షలకు పైగా సిప్‌లు నమోదయ్యాయి. ఒక నెలలోనే సిప్‌లు 34 శాతం మేర పెరగడం గమనార్హం. అదే సమయంలో నిలిపివేయపడిన సిప్స్ సంఖ్య నవంబరులో 7.24 లక్షలు కాగా, డిసెంబరులో 7.76 లక్షలకు చేరుకుంది.


సిప్స్ పెరుగుదలతో మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు నవంబరులో రూ. 7302 కోట్లు కాగా డిసెంబరులో ఇది రూ.8418 కోట్లు. ఈక్విటీస్ మార్కెట్‌లో భారీ పెరుగుదల అనంతరం ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో... మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 2020 రెండో అర్ధ సంవత్సరంలో ఈక్విటీ ఫండ్స్ నుండి స్థిర ప్రవాహాన్ని చూసింది. ఇక 2020 లో డీమ్యాట్ ఖాతాలు రికార్డు స్థాయిలో పెరగడం విశేషం. 


Updated Date - 2021-01-13T21:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising