ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌కు భారీ షాక్.. 98 మిలియన్ డాలర్ల జరిమానా

ABN, First Publish Date - 2021-12-25T01:51:00+05:30

సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. చట్ట విరుద్ధంగా భావించే కంటెంట్‌ను తొలగించడంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. చట్ట విరుద్ధంగా భావించే కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు గాను 7.2 బిలియన్ రూబెల్స్ (98 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. గూగుల్ రెవెన్యూ ఆధారంగా ఈ జరిమానాను విధించినట్టు కోర్టు తెలిపింది. కాగా, ఈ జరిమానాలు ఒక్క గూగుల్‌కే పరిమితం కాదు. ఈ ఏడాది పలు టెక్నాలజీ సంస్థలపై రష్యా కొరడా ఝళిపించింది. సాధారణంగా జరిమానా మిలియన్ డాలర్ల లోపే ఉండగా, ఈసారి మాత్రం భారీ స్థాయిలో జరిమానా విధించింది.


గూగుల్‌ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ పదేపదే చేసిన తప్పే చేయడంతోనే కోర్టు ఈ జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, తర్వాత ఏం చేయబోతున్నది త్వరలోనే వెల్లడిస్తామని గూగుల్ తెలిపింది. రష్యా తన డిజిటల్ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో భాగంగా విదేశీ సోషల్ మీడియా సంస్థలు, ఇంటర్నెట్ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతోంది. అనధికారిక నిరసనలను ప్రోత్సహించే పోస్టులు, చట్టవిరుద్ధమని భావించే ఇతర విషయాలను తొలగించమని గూగుల్, ట్విట్టర్ సహా పలు కంపెనీలను కోరుతోంది. ఆదేశాలను పెడచెవిన పెట్టే సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తోంది. అందులో భాగంగానే మాస్కో కోర్టు గూగుల్‌కు తాజా జరిమానా విధించింది. 

Updated Date - 2021-12-25T01:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising