‘పీవీఆర్’కు... మునుముందు మంచి రోజులు...
ABN, First Publish Date - 2021-11-25T21:05:45+05:30
వరుస లాక్డౌన్లతో షూటింగ్‌లు వాయిదాలు పడి మూవీ రిలీజుల్లో జాప్యం జరుగుతుండగా, మరోవైపు... ఉన్న సినిమాలను ప్రదర్శించుకుందామనుకున్నా కూడా... అవకాశం లేకుండా థియేటర్ల మూత వంటి పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ : వరుస లాక్డౌన్లతో షూటింగ్‌లు వాయిదాలు పడి మూవీ రిలీజుల్లో జాప్యం జరుగుతుండగా, మరోవైపు... ఉన్న సినిమాలను ప్రదర్శించుకుందామనుకున్నా కూడా... అవకాశం లేకుండా థియేటర్ల మూత వంటి పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... కుదులైన ‘పీవీఆర్’కు... నాలుగో త్రైమాసికం... మంచి శకునంలా కనిపిస్తోంది. మార్చి త్రైమాసికంలో... బాలీవుడ్ బిగ్ మూవీస్ రిలీజ్లు ఉండడంతో, అప్పటికైనా... పూర్తిస్థాయిలో కోలుకోవాలని భావిస్తోంది. జాన్ అబ్రహం నటించిన ‘సత్యమేవ్ జయతే-2’, సల్మాన్ ఖాన్ యాక్షన్ మూవీ ‘యాంటిమ్’, (ది ఫైనల్ ట్రూత్’, రణవీర్ సింగ్-దీపిక కాంబినేషన్లో వస్తున్న ‘83’, షాహిద్ కపూర్ బ్యాట్ చేతబట్టిన ‘జెర్సీ’, అలియా భట్ స్టారింగ్‌లో ‘గంగూబాయి’, ‘కతియావాడి’ సహా మరికొన్ని సినిమాలు రానున్న నెలల్లో విడుదల కానున్నాయి. ప్రస్తుత ఆక్యుపెన్సీ 40 శాతంగా ఉంది, కానీ సూర్యవంశీ సమయంతో పెరిగిందని పీవీఆర్ యాజమాన్యం చెబుతోంది. ప్రస్తుతం గేమింగ్‌తో ప్రయోగాలు చేస్తున్న ఈ కంపెనీ... దానినుంచి మంచి స్పందననే అందుకుంటోంది.
Updated Date - 2021-11-25T21:05:45+05:30 IST