ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’లోనూ బంగారం దిగుమతుల జోరు

ABN, First Publish Date - 2021-04-19T06:03:14+05:30

దేశంలో బంగారం డిమాండ్‌ పెరగడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 22.58 శాతం పెరిగి 346 కోట్ల డాలర్లుగా (రూ.2.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గత ఏడాది 23 శాతం వృద్ధి


న్యూఢిల్లీ : దేశంలో బంగారం డిమాండ్‌ పెరగడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 22.58 శాతం పెరిగి 346 కోట్ల డాలర్లుగా (రూ.2.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇదే కాలంలో వెండి దిగుమతులు మాత్రం 71 శాతం క్షీణించి 79.1 కోట్ల డాలర్లకు దిగివచ్చాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు మాత్రం 27.5 శాతం క్షీణించి 2600 కోట్ల డాలర్లకు పడిపోయాయి. 2019-20లో వెండి దిగుమతుల విలువ 2823 కోట్ల డాలర్లు (రూ.2 లక్షల కోట్లు). బంగారం దిగుమతులు పెరిగినా గత ఏడాది వాణిజ్య లోటు 9856 కోట్ల డాలర్లుంది. బంగారం డిమాండ్‌ దేశంలో పెరిగిందని, రాబోయే అక్షయ తృతీయ, వివాహాల సీజన్‌ సమయంలో మరింతగా పెరగవచ్చని వజ్రాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్‌ కోలిన్‌ షా అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద బంగారం దిగుమతి దేశం భారత్‌. ఏటా సగటున 800-900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. 


Updated Date - 2021-04-19T06:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising