ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం వ్యాపారుల మోసాలకు చెక్‌.. నేటి నుంచి హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి!

ABN, First Publish Date - 2021-06-15T08:48:36+05:30

నగల వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. ఇప్పటి వరకు స్వచ్ఛందంగా అమలు చేస్తున్న ‘హాల్‌మార్కింగ్‌’ను మంళవారం నుంచి తప్పనిసరి చేసింది. దీంతో అధిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నగల వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. ఇప్పటి వరకు స్వచ్ఛందంగా అమలు చేస్తున్న ‘హాల్‌మార్కింగ్‌’ను మంళవారం నుంచి తప్పనిసరి చేసింది. దీంతో అధిక స్వచ్ఛత పేరుతో నాసిరకం నగలను కొనుగోలుదారులకు అంటగట్టే వ్యాపారుల మోసాలకు తెరపడనుంది.


రెండు సార్లు వాయిదా

నిజానికి ఈ నిర్ణయం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి రావాలి. తర్వాత జూన్‌ 1కు వాయిదా వేశారు. కొవిడ్‌ రెండో ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలని నగల వ్యాపారుల సంఘాలు మళ్లీ ప్రభుత్వాన్ని కోరాయి. ఇందుకోసం ప్రభుత్వానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు పంపాయి. అయితే ప్రభుత్వం కేవలం 15 రోజలు పొడిగించి, మంగళవారం నుంచి అమలు చేస్తోంది. ఈ నిర్ణయంతో నగల వ్యాపారులు ఇక ‘హాల్‌మార్క్‌’ గుర్తు ఉన్న 14, 18, 22 క్యారట్ల మూడు కేటగిరీల నగలను మాత్రమే అమ్మాలి.


20  ఏళ్ల క్రితమే ప్రమాణాలు

బంగారు నగల ‘హాల్‌మార్క్‌’ ప్రమాణాలను భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) 20 ఏళ్ల క్రితమే ఖరారు చేసింది. అప్పటి నుంచి కొంత మంది నగల వ్యాపారులు ముఖ్యంగా సంఘటిత రంగంలోని జువెలరీ సంస్థలు స్వచ్ఛందంగా దీన్ని అమలు చేస్తున్నాయి. అసంఘటిత రంగంలోని నగల వ్యాపారులు మాత్రం పెద్దగా అమలు చేయడం లేదు. మరోవైపు దేశంలో ఇంకా సరిపడా హాల్‌మార్కింగ్‌ మౌలిక సదుపాయాలు లేవని చెబుతున్నారు. అయితే ఈ వాదనను బీఐఎస్‌ తోసిపుచ్చింది. 


నగలు కొనేటప్పుడు  ఇవి గుర్తుంచుకోండి...

  • హాల్‌మార్కింగ్‌ నగలోని బంగారం స్వచ్ఛతకు చిహ్నం
  • మంగళవారం నుంచి వ్యాపారులు 14, 18, 22  క్యారట్ల నగలు మాత్రమే విక్రయించాలి
  • బంగారంతో చేసే కళాత్మక వస్తువులకు కూడా హాల్‌మార్కింగ్‌ చిహ్నం తప్పనిసరి నగపైనే కాకుండా వ్యాపారులు ఇచ్చే బిల్లులోనూ  ఎన్ని క్యారట్లు, హాల్‌మార్కింగ్‌ వివరాలు ఉండాలి
  • ప్రతి నగపై తప్పనిసరిగా బీఐఎస్‌ గుర్తు, నగలో బంగారం శాతాన్ని తెలిపే 14, 8, 22 క్యారట్ల  వివరాలు ఉండాలి
  • హాల్‌మార్కింగ్‌ కేంద్ర గుర్తింపును తెలిపే సంఖ్య, నగల వ్యాపారి గుర్తింపు సంఖ్య కూడా నగపై ఉంటుంది.


Updated Date - 2021-06-15T08:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising