ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పసిడి బాండ్ల ఇష్యూ

ABN, First Publish Date - 2021-03-01T06:33:11+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి 12వ విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) ఇష్యూ సబ్‌స్ర్కిప్షన్‌ సోమవారం ప్రారంభమవుతోంది. ఒక గ్రాము కు సమానమైన ఎస్‌జీబీ ధరను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గ్రాము ధర రూ.4,662


ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి 12వ విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) ఇష్యూ సబ్‌స్ర్కిప్షన్‌ సోమవారం ప్రారంభమవుతోంది. ఒక గ్రాము కు సమానమైన ఎస్‌జీబీ ధరను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రూ.4,662గా నిర్ణయించింది. ఈ నెల 5 వరకు ఈ బాండ్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాణిజ్య బ్యాం కులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి యా లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఆర్‌బీఐ పేర్కొన్న పోస్టాఫీసులు లేదా బీఎ్‌సఈ, ఎన్‌ఎస్‌ఈ ద్వారా ఈ బాండ్స్‌ కోసం దరఖాస్తు చేయాలి. 

   


ప్రధానాంశాలు..


  1. బాండ్‌ కాల పరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం
  2. వ్యక్తిగత మదుపరులు కనీసం ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా నాలుగు కిలోలకు సమానమైన ఎస్‌జీబీల కోసం దరఖాస్తు చేయవచ్చు
  3. అవిభక్త హిందూ కుటుంబాలు నాలుగు కిలోల వరకు, ట్రస్టులు, యూనివర్సిటీల వం టి సంస్థలు 20 కిలోలకు సమానమైన ఎస్‌జీబీలకు దరఖాస్తు చేయవచ్చు
  4. ఈ బాండ్స్‌పై 2.5 శాతం వార్షిక వడ్డీ. ప్రతి ఆరు నెలలకు మదుపరుల బ్యాంక్‌ ఖాతాలో వడ్డీ జమ
  5. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసి డిజిటల్‌ పద్దతిలో చెల్లింపులు చేస్తే ప్రతి గ్రాము బాండ్‌పై రూ.50 డిస్కౌంట్‌
  6. రిడంప్షన్‌ సమయంలో వచ్చే మూలఽధన లాభాలపై ఆదాయ పన్ను మినహాయింపు
  7. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో ట్రేడయ్యేలా డీమ్యాట్‌ రూపంలో ఎస్‌జీబీలు కేటాయింపు

Updated Date - 2021-03-01T06:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising