ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.48వేల దిగువకు బంగారం

ABN, First Publish Date - 2021-06-18T09:42:45+05:30

దేశంలో విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. గురువారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర రూ.861 తగ్గి రూ.47,724గా నమోదైంది. కిలో వెండి రూ.1,709 తగ్గి రూ.68,798 ధర పలికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.69 వేలకు తగ్గిన వెండి 


న్యూఢిల్లీ: దేశంలో విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. గురువారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర రూ.861 తగ్గి రూ.47,724గా నమోదైంది. కిలో వెండి రూ.1,709 తగ్గి రూ.68,798 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు భారీగా పడిపోవడమే ఇందుకు కారణం. న్యూయార్క్‌ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 89 డాలర్ల మేర తగ్గి 1,772 డాలర్లుగా ట్రేడవగా.. సిల్వర్‌ 25.98 డాలర్లకు జారుకుంది. పరపతి సమీక్షలో భాగంగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించినప్పటికీ,వ డ్డీ రేట్లను మార్కెట్‌ అంచనాల కంటే ముందుగానే పెంచనున్నట్లు సంకేతాలిచ్చింది. 2023లో వడ్డీ రేట్లను రెండు సార్లు పెంచేందుకు అవకాశం ఉందన్న ఫెడ్‌ వ్యాఖ్యలతో డాలర్‌ పుంజుకుంది. దీంతో విలువైన లోహాలకు డిమాండ్‌ తగ్గింది. 

Updated Date - 2021-06-18T09:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising