ఐఎంఎఫ్ పదవికి గీతా గోపీనాథ్ గుడ్‌బై
ABN, First Publish Date - 2021-10-21T07:55:02+05:30
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త పదవి నుంచి గీతా గోపీనాథ్ వైదొలగనున్నారు.
వాషింగ్టన్ : అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త పదవి నుంచి గీతా గోపీనాథ్ వైదొలగనున్నారు. జనవరి నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ టెన్యూర్డ్ ప్రొఫెసర్ ఉద్యోగానికి తిరిగి వెళ్తున్నట్టు గోపీనాథ్ ప్రకటించారు. మైసూరులో జన్మించిన భారతీయ సంతతికి చెందిన అమెరికన్ అయిన ఆమె ఐఎంఎ్‌ఫలో తొలి మహిళా ముఖ్య ఆర్థికవేత్తగా రికార్డు నెలకొల్పారు.
Updated Date - 2021-10-21T07:55:02+05:30 IST