ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 1419 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్

ABN, First Publish Date - 2021-04-18T00:04:27+05:30

యూఎస్ కార్ మేకర్ జనరల్ మోటార్స్ ఇండియా భారత్‌లో 1,419 మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: యూఎస్ కార్ మేకర్ జనరల్ మోటార్స్ ఇండియా భారత్‌లో 1,419 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. పూణే శివారులోని తాలేగావ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వీరికి పారిశ్రామిక వివాద చట్టంలోని  సెక్షన్ 25 ప్రకారం లే ఆఫ్ ఇచ్చింది. కంపెనీ చర్యపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.


ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించాయి. లే ఆఫ్ ప్రకటించిన ఉద్యోగులందరికీ కంపెనీ ఓ ఈ-మెయిల్ పంపింది. అదే కాపీని జనరల్ మోటార్స్ ఉద్యోగుల యూనియన్ కార్యదర్శి, అధ్యక్షుడికి కూడా పంపింది.


పారిశ్రామిక వివాద చట్టం 1947లోని సెక్షన్ 25-సి ప్రకారం వీరందరికీ లే ఆఫ్ పరిహారం లభిస్తుందని జనరల్ మోటార్స్ పేర్కొంది. అలాగే, వారి మూల వేతనంలో 50 శాతాన్ని పరిహారంగా చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై తాము కోర్టులో తేల్చుకుంటామని జనరల్ మోటార్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సందీప్ భెగాడే తెలిపారు.  

Updated Date - 2021-04-18T00:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising