ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యూ1 జీడీపీకి భారీ కుదుపు

ABN, First Publish Date - 2021-05-05T06:59:55+05:30

దేశంలో కరోనా-2 ఉదృతిని అరికట్టేందుకు విధించిన స్థానిక లాక్‌డౌన్లు మొదటి త్రైమాసికం (క్యూ1)జీడీపీని భారీగా కుంగదీస్తాయని స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ తేల్చి చెప్పగా వాల్‌స్ర్టీట్‌ బ్రోకరేజీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తేల్చి చెప్పిన యూబీఎస్‌ 
  • కీలక సూచీల భారీ పతనం.. గోల్డ్‌మాన్‌ శాక్స్‌

ముంబై : దేశంలో కరోనా-2 ఉదృతిని అరికట్టేందుకు విధించిన స్థానిక లాక్‌డౌన్లు మొదటి త్రైమాసికం (క్యూ1)జీడీపీని భారీగా కుంగదీస్తాయని స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ తేల్చి చెప్పగా వాల్‌స్ర్టీట్‌ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాను 11.1 శాతానికి కుదించింది. యూబీఎస్‌ యాక్టివిటీ ఇండికేటర్‌ ఏప్రిల్‌లో 7 శాతం దిగజారింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ క్షీణత 25.5 శాతం ఉంది. ప్రధాన వ్యాపార కేంద్రాల్లో కార్యకలాపాలు భారీగా క్షీణించడం ఇందుకు కారణమని సంస్థ చీఫ్‌ ఎకనామిస్ట్‌ తన్వీ గుప్తా తెలిపారు. మే నెలలో లాక్‌డౌన్లు విస్తరించిన కారణంగా ఈ సూచీ మరింతగా దిగజారడం ఖాయమని ఆమె అన్నారు. ప్రధానంగా వాహన రిజిస్ట్రేషన్లు, ఈ-వే బిల్లులు, ప్రయాణికుల ట్రాఫిక్‌, విద్యుత్‌ డిమాండుపై ఇప్పటికే లాక్‌డౌన్ల తీవ్ర ప్రభావం ఉన్నదని ఆమె తెలిపారు. అయితే జీడీపీపై ప్రతికూల ప్రభావం 2020 కన్నా తక్కువగానే ఉంటుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ ఏడాది వృద్ధి 11.1 శాతమే : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 11.1 శాతానికే పరిమితం అవుతుందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనా వేసింది. స్థానిక లాక్‌డౌన్ల ప్రభావం గత ఏడాది కన్నా తక్కువగానే ఉంటుందని, కాని పలు నగరాల యాక్టివిటీ సూచీలు ఇప్పటికే బాగా ప్రభావితమయ్యాయని తాజా నివేదికలో తెలిపింది. ప్రధానంగా నిరుద్యోగిత రేటు గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 

కరోనా అదుపులోకి వచ్చి ఆంక్షలు సడలించినట్టయితే మూడో త్రైమాసికంలో వివిధ కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవచ్చునని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్‌ సంస్థలు జీడీపీ అంచనాలు కుదించిన నేపథ్యంలో ఈ తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

Updated Date - 2021-05-05T06:59:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising