ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్విస్ బ్యాంకుల్లో రూ. 20 వేల కోట్లకుపైనే భారతీయుల సొమ్ము.. కేంద్రం ఏం చెప్పిందంటే?

ABN, First Publish Date - 2021-06-19T22:02:00+05:30

గతేడాది నాటికి స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల సంపద రూ. 20,700 కోట్లకు చేరుకుందన్న వార్తలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గతేడాది నాటికి స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల సంపద రూ. 20,700 కోట్లకు చేరుకుందన్న వార్తలపై భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి కొట్టిపడేసింది. స్విస్ బ్యాంకుల్లో 2019 చివరి నాటికి రూ. 6,625 కోట్లు (సీహెచ్ఎఫ్ 899 మిలియన్)గా ఉన్న భారతీయుల సొమ్ము 2020 చివరి నాటికి  రూ. 20,700 కోట్లు (సీహెచ్ఎఫ్ 2.55 బిలియన్)కు చేరుకుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.


రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్నప్పటికీ నిధులు ఈ స్థాయిలో పెరగాయని, గత 13 ఏళ్లగా డిపాజిట్ అవుతున్న దానికంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధులు జమ అయ్యాయంటూ వార్తలు వచ్చాయని కేంద్రం తెలిపింది.


స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎన్ఎన్‌బీ)కి బ్యాంకులు నివేదించిన అధికారిక గణాంకాల ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం డిపాజిట్ అయిందనేది నిజం కాదని, ఇంకా చెప్పాలంటే డిపాజిట్ అయిన మొత్తం భారతీయులది, ఎన్నారైలది కాదని, ఆ సొమ్ము ఇతర దేశాలకు చెందిన వారిదని కేంద్రం వివరించింది. నిజానికి 2019 చివరి నుంచి ఖాతాదారుల డిపాజిట్లు క్షీణిస్తూ వచ్చాయని తెలిపింది. వారంతా బాండ్లు, సెక్యూరిటీల రూపంలోను, ఇతర ఆర్థిక విధానాల్లో జమ చేస్తూ వస్తున్నారని వివరించింది.


ఫైనాన్షియల్ అకౌంట్స్ సమాచారం ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ మొత్తం పెరిగినట్టు సమాచారం లేదని, పెరిగిన మొత్తం కూడా భారతీయులదేనని కచ్చితమైన సమాచారం లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను స్విస్ అధికారుల నుంచి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ మరిన్ని వివరాలు కోరింది. 

Updated Date - 2021-06-19T22:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising