ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్‌డీపై ఉచిత ఇన్సూరెన్స్‌

ABN, First Publish Date - 2021-05-16T07:23:23+05:30

కొన్ని బ్యాంక్‌లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎ్‌ఫడీ)పై ఉచిత బీమా కవరేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ఉచిత బీమా పాలసీ పరిమితులు, నిబంధనలు, షరతులేంటో ముందుగా తెసుకున్నాకే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముందుగా షరతులేంటో తెలుసుకోండి.. 

కొన్ని బ్యాంక్‌లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎ్‌ఫడీ)పై ఉచిత బీమా కవరేజీని ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ఉచిత బీమా పాలసీ పరిమితులు, నిబంధనలు, షరతులేంటో ముందుగా తెసుకున్నాకే ఎఫ్‌డీ ఖాతా తెరవడం ఉత్తమం. లేదంటే, కవరేజీ క్లెయిమ్‌ చేసుకోవడంలో ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు డీసీబీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆఫర్లను పరిశీలిద్దాం.. 


డీసీబీ బ్యాంక్‌ 

  1. ఈ బ్యాంక్‌ సురక్ష ఎఫ్‌డీలపై ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌తో జట్టుకట్టింది. 
  2. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, 18 నుంచి 54 ఏళ్ల వారు మాత్రమే ఈ ఎఫ్‌డీ ఖాతా తెరవగలరు. 55 ఏళ్లు పూర్తి చేసుకున్నవారు అనర్హులు. 
  3. ఎఫ్‌డీ సొమ్ము మొత్తానికి సమానమైన జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. గరిష్ఠ కవరేజీ రూ.50 లక్షలు. ఉదాహరణకు, రూ.కోటితో ఎఫ్‌డీ ఖాతా తెరిచినా, లభించే బీమా కవరేజీ మాత్రం యాభై లక్షలే. 
  4. 6.75 శాతం వార్షిక వడ్డీ లభించే ఈ ఎఫ్‌డీ కాలపరిమితి మూడేళ్లు. 


ఐసీఐసీఐ బ్యాంక్‌ 

  1. ఈ బ్యాంక్‌ రూ.3 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఆఫర్‌ చేస్తోంది. కనీసం రూ.3 లక్షలు, అంతకుపైగా డిపాజిట్‌ చేసినవారికి ఏడాది పాటు ఈ బీమా కవరేజీ వర్తిస్తుంది. 
  2. రెండేళ్లు లేదా అంతకంటే అధిక కాలానికి డిపాజిట్‌ చేసినవారికే బీమా సదుపాయం లభిస్తుంది. అంతేకాదు, 18 నుంచి 50 ఏళ్ల వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 

మరికొన్ని షరతులు

  1. ఈ రెండు బ్యాంక్‌ల విషయంలోనూ, ఎఫ్‌డీని కాలపరిమితి కంటే ముందే ఉపసంహరించుకుంటే, జీవిత బీమా కవరేజీ కూడా ఉపసంహరించబడుతుంది. 
  2. జాయింట్‌ అకౌంట్‌ తెరిచిన పక్షంలో, ప్రాథమిక ఖాతాదారుకు మాత్రమే బీమా సౌకర్యం లభిస్తుంది. 


చివరిగా.. 

ఉచిత బీమా లభిస్తుందన్న ఆశతో డబ్బులు డిపాజిట్‌ చేయవద్దు. ఎఫ్‌డీపై బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తున్న వార్షిక వడ్డీతో పాటు ఇతర సదుపాయాలే ప్రధానం. ఉచిత బీమా ఇందుకు అదనం మాత్రమే. అంతేకాదు, ఎఫ్‌డీలు, మ్యూచువల్‌ ఫండ్లపై లభించే ఉచిత బీమాపైనే ఆధారపడకుండా, మీ కుటుంబ అవసరాలకు సరిపోయేలా సమగ్ర బీమా పాలసీని కొనుగోలు చేయడం మేలని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు.  


Updated Date - 2021-05-16T07:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising