ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రెడిట్ కార్డు క్యాష్... వడ్డీ తొమ్మిది శాతమే... వారికే సౌలభ్యం...

ABN, First Publish Date - 2021-01-19T23:46:40+05:30

ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు క్రెడిట్ కార్డు మీద నగదు ఉపసంహరణ వడ్డీ రేట్లను తొమ్మిది శాతగా నిర్ధారించాలని హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు యోచిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు క్రెడిట్ కార్డు మీద నగదు ఉపసంహరణ వడ్డీ రేట్లను తొమ్మిది శాతగా నిర్ధారించాలని హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు  యోచిస్తోంది. క్రెడిట్ కార్డుల నుండి నగదు ఉపసంహరణపై అధిక వడ్డీలను వసూలు చేసే అంశానికి సంబంధించి దూరంగా ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు భావిస్తోంది. మంచి క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ ఉన్న కస్టమర్లకు ఇప్పటి నుండి కార్డు నగదు ఉపసంహరణపై తక్కువ వడ్డీ రేటు చెల్లించే అవకాశం ఉంటుంది. వివరాలిలా ఉన్నాయి.


హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డు బిజినెస్‌ను ప్రారంభించింది. ఈ నేపధ్యంలో కస్టమర్ల నుంచి తొమ్మిది శాతం కంటే తక్కువ వడ్డీనే వసూలు చేయాలని భావిస్తోంది. కాగా... కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి... వార్షిక శాత వడ్డీ రేటు మారుతుంటుంది. ఇది 36 శాతం వరకు ఉంటుంది. ఇప్పటికే క్రెడిట్ కార్డు మార్కెట్ లో పలు సంస్థలు ఉన్నాయి. ఆలస్యంగా ప్రవేశించిన హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు... బిన్నంగా ముందుకెళ్లాలని యోచిస్తోంది.  ఈ క్రమంలో... కస్టమర్ ప్రొఫైల్‌ను అంచనా వేసేందుకు, స్కోర్ ఆదారంగా వడ్డీ రేట్లను అందించేందుకు బ్యాంకు యాజమాన్యం స్కోరింగ్ విధానాన్ని రూపొందించింది. ఈ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుంది. వచ్చే రెండు నెలల్లో కస్టమర్ల నుండి ఈ బ్యాంకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఏప్రిల్ నుండి బ్యాంకుయేతర కస్టమర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 




Updated Date - 2021-01-19T23:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising