ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగుమతులు ఆశాజనకం...

ABN, First Publish Date - 2021-01-11T22:13:13+05:30

దేశ ఎగుమతులు మెరుగుపడు తుండడం ఊరటనిస్తోంది. జనవరి మొదటి వారంలో 16.22 శాతం మేర పెరిగిన ఎగుమతులు... 6.21 బిలియన్‌ డాలర్లకు చేరాయని వాణి జ్యమంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించిన గణాం కాలు చెబుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 న్యూఢిల్లీ : దేశ ఎగుమతులు మెరుగుపడు తుండడం ఊరటనిస్తోంది. జనవరి మొదటి వారంలో 16.22 శాతం మేర పెరిగిన ఎగుమతులు... 6.21 బిలియన్‌ డాలర్లకు చేరాయని వాణి జ్యమంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించిన గణాం కాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఫార్మస్యూటికల్స్‌, ఇంజనీరింగ్‌ తదితర రంగాల ఎగుమతుల పెరుగుదల ఇందుకు దోహదపడింది. ఆర్థికవ్యవస్థలో రికవరీకి ఈ గణాంకాలు నిదర్శనంగా ఉన్నాయని చెబుతున్నారు. కాగా గతేడాది జనవరి మొదటి వారంలో ఎగుమతుల విలువ 5.34 బిలియన్‌ డాలర్లు కాగా, ఈ ఏడాది జనవరి మొదటి వారంలో దిగుమతులు 1.07 శాతం మేర పెరిగి 8.7 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ 8.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఫార్మష్యూటికల్స్‌, పెట్రోలియం, ఇంజనీరింగ్‌ ఎగుమతులు 14.4 శాతం(61.62 మిలియన్‌ డాలర్లు), 17.28 శాతం(114.72 మిలియన్‌ డాలర్లు), 51.82 శాతం(636.77 మిలియన్‌ డాలర్లు) చొప్పున పెరిగాయి. కాగా కిందటి సంత్సరం నవంబరు లో ఎగుమతులు 8.74 శాతం మేర క్షీణించాయి. ఆ తర్వాత డిసెంబరులో ఎగుమతులు స్వల్పంగా, అంటే... 0.8 శాతం మేర తగ్గాయి. కాగా జనవరి మొదటి వారంలో ఎగుమతుల పెరుగుదలకు రత్నాలు, నగలు, ఇంజనీరింగ్‌, కెమికల్స్‌ ఎగుమతులు కూడా పెరగ డం... ఎగుమతుల పెరుగుదలకు దోహదపడింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత డిసెంబరు దిగుమతుల్లో 7.6 శాతం సానుకూల వృద్ధి నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Updated Date - 2021-01-11T22:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising