రూ.1,750 కోట్లతో 3ఎఫ్ ఆయిల్ పామ్ విస్తరణ
ABN, First Publish Date - 2021-10-07T08:04:11+05:30
హైదరాబాద్‌కు చెందిన 3ఎఫ్ ఆయిల్ పామ్ అరుణాచల్ ప్రదేశ్‌లో విస్తరణ, అసోమ్‌లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించడానికి రూ.1,750 కోట్ల పెట్టుబడులు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన 3ఎఫ్ ఆయిల్ పామ్ అరుణాచల్ ప్రదేశ్‌లో విస్తరణ, అసోమ్‌లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించడానికి రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే అయిదేళ్లలో ఈశాన్య ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగును 2,000 హెక్టార్ల నుంచి 62,000 హెక్టార్లకు పెంచుకోవాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్‌ను యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు 3ఎఫ్ ఆయిల్ పామ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంజయ్ గోయెంకా తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో చేపట్టే విస్తరణ కార్యక్రమాల వల్ల దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ -ఆయిల్ పామ్ పథకం కింద విస్తరణను చేపడుతున్నట్లు చెప్పారు.
Updated Date - 2021-10-07T08:04:11+05:30 IST