ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవర్‌గ్రాండ్... ‘డిఫాల్టర్‌’ ?

ABN, First Publish Date - 2021-10-22T04:58:53+05:30

చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే... మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. అంతర్జాతీయ నిర్మాణ సంస్థ ‘ఎవర్‌గ్రాండ్’పై ‘డిఫాల్టర్‌’ ముద్ర పడే పరిస్థితి కనిపిస్తోంది. ఎవర్‌గ్రాండ్ షేర్లు భారీగా పతనమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే... మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. అంతర్జాతీయ నిర్మాణ సంస్థ ‘ఎవర్‌గ్రాండ్’పై  ‘డిఫాల్టర్‌’ ముద్ర పడే పరిస్థితి కనిపిస్తోంది. ఎవర్‌గ్రాండ్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సేంజిలో... ఎవర్‌గ్రాండ్ పధ్నాలుగు శాతం పతనాన్ని చూడాల్సివచ్చింది. ఇప్పటికే ఆర్ధికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్‌.. తన యూనిట్లలో ఒకదానిని 2.6 బిలియన్‌ డాలర్లకు విక్రయించాలన్న ప్రతిపాదనతోపాటు అందుకు సంబంధించిన యత్నాలు విఫలమైన విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే... ఎవర్‌గ్రాండ్ షేర్లు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో...  గృహనిర్మాణ రంగం మందగించింది. తత్ఫలితంగా... ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గవచ్చన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఎవర్‌గ్రాండ్ ప్రాపర్టీస్‌ సర్వీసెస్‌లో సింహభాగాన్ని( 51 శాతం)  హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు విక్రయించే ప్రతిపాదనను ఉపసంహరించుకోనున్నట్లు నిన్న(బుధవారం) ఓ అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. కాగా... హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ మాత్రం... ఎవర్‌గ్రాండ్‌ విధించిన షరతుల నేపధ్యంలోనే సంబంధిత ప్రక్రియనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2021-10-22T04:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising