ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఒమిక్రాన్’లో కూడా... రెండు రోజులు... రూ. 5.47 లక్షల కోట్లు పెరిగిన సంపద...

ABN, First Publish Date - 2021-12-04T02:11:40+05:30

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్... ఏ సమయంలో కూడా... నష్టాల్లోకి జారుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి.  ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్... ఏ సమయంలో కూడా...  నష్టాల్లోకి జారుకోలేదు. ఐటీ, మెటల్, ఆటో, పవర్ రంగాలు పరుగులు పెట్టాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్టాక్స్ నాలుగు శాతం చొప్పున లాభపడ్డాయి. ఓ వైపు ఒమిక్రాన్ ఆందోళన ఉన్నప్పటికీ కూడా... ఆయా దేశాల కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటు, జీఎస్‌టీ వసూళ్ళ వంటివి కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరచాయి. వాహన విక్రయాలు క్షీణించినప్పటికీ, కమర్షియల్ వెహికిల్ అమ్మకాలు మాత్రం పెరిగాయి. మొత్తానికి వాహన విక్రయాలు తగ్గినప్పటికీ సానుకూలత కనిపించింది. ఈ పరిణామాలన్నీ కూడా  మార్కెట్‌కు సానుకూలంగానే ఉన్నాయి.


కాగా...  కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’తో పెద్దగా భయపడాల్సిన పని లేదని, బూస్టర్ డోసుతో అడ్డుకోవచ్చని వార్తలు రావడం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలపడటానికి దోహదం చేసింది. పలు స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. మొత్తంమీద మార్కెట్లు నేడు 770 పాయింట్లకు పైగా లాభపడటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3.28 లక్షల కోట్ల మేర పెరిగింది. బుధవారం 600 పాయింట్లకు పైగా లాభపడిన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2.19 లక్షల కోట్లు పెరిగింది. ఈ రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 5.47 లక్షల కోట్లు పెరిగింది. 

Updated Date - 2021-12-04T02:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising