అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించిన భారత్
ABN, First Publish Date - 2021-10-30T03:40:08+05:30
అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. నవంబరు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. నవంబరు 30వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ ఆమోదించిన ప్రత్యేక విమానాలకు వర్తించదని తెలిపింది.
కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. గతంలో ఈ నిషేధాన్ని ఈ నెల 31 వరకు విధించగా, తాజాగా దీనిని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Updated Date - 2021-10-30T03:40:08+05:30 IST