ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీమార్ట్‌ లాభం రూ.414 కోట్లు

ABN, First Publish Date - 2021-05-09T06:14:09+05:30

ఈ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ రూ.7,411.68 కోట్ల ఆదాయంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఈ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ రూ.7,411.68 కోట్ల ఆదాయంపై రూ.413.87 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 18.47 శాతం, నికర లాభం 52.56 శాతం పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం డీమార్ట్‌కు పెద్దగా కలిసి రాలేదు.  ఈ కాలానికి కంపెనీ రూ.24,143.06 కోట్ల ఆదాయంపై రూ.1,099.43 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంత్సరంతో పోలిస్తే ఆదాయం 2.92 శాతం, నికర లాభం 15.5 శాతం పడిపోయాయి. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్లు, ఇతర సమస్యలు గత ఆర్థిక  సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ ఆదాయం, లాభాలను బాగా దెబ్బతీశాయి. గత ఏడాది నవంబరు నుంచి పెరుగుతూ వచ్చిన వ్యాపారం, ఈ ఏడాది జనవరి నుంచి పూర్తి స్థాయిలో పుంజుకుంది. 

Updated Date - 2021-05-09T06:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising