ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ‘గద్ద’లు... చాలా కాస్ట్‌లీ గురూ... ఒక్కోటి రూ. 4-10 లక్షలు...

ABN, First Publish Date - 2021-03-24T01:01:12+05:30

పక్షల్లో గద్దలు డిఫరెంట్ అన్న విషయం తెలిసిందే. గద్ద ముక్కు, డేగ కళ్ళు వంటి ఉపమానాలను వాడుతుండడం చూస్తూనే ఉంటాం. అయితే... ఒక్క గద్ద ఖరీదు రూ. 4-0 లక్షలంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. ఇది నిజం. నమ్మలేకపోతున్నారా ? ఈ కథనం చదవండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హర్యానా : పక్షల్లో గద్దలు డిఫరెంట్ అన్న విషయం తెలిసిందే. గద్ద ముక్కు, డేగ కళ్ళు వంటి ఉపమానాలను వాడుతుండడం చూస్తూనే ఉంటాం. అయితే... ఒక్క గద్ద ఖరీదు రూ. 4-0 లక్షలంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. ఇది నిజం. నమ్మలేకపోతున్నారా ? ఈ కథనం చదవండి. 


 పాకిస్తాన్, అరబ్ దేశాల మధ్య చమురుతోపాటు మరో వ్యాపారం కూడా నడుస్తోంది. అయితే ఇది అక్రమ వ్యాపారం. అది కూడా ‘గద్ద’ల వ్యాపారం. గద్దలను తరలిస్తున్నవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతోన్న సందర్భాలున్నాయి. గద్దలను అక్రమ మార్గాల్లో తరలిస్తోన్న ప్రహసనం వెలుగు చూసింది. గద్ద(డేగలు)లతో పాటు, అలాంటి కొన్ని పక్షుల అక్రమ రవాణా భారీగా జరుగుతోంది. పాకిస్తాన్‌లో ఒక డేగ అమ్మినందుకు వేటగాళ్ళపై డాలర్ల వర్షం కురుస్తోంది. అదీ మామూలుగా కాదు... లక్షల్లో. పెద్ద సంఖ్యలో డీలర్లు కరాచీకి వచ్చి స్మగ్లర్లతో ఇందుకు సంబంధించిన లావాదేవీలను నడుపుతుంటారు. గద్ద(డేగ)లను పట్టుకోవటానికి వేటగాళ్లు  వారాలతరబడి పాకిస్తాన్‌ అడవుల్లో మాటువేస్తుంటారు. 


భారీ ధర…

పాకిస్తాన్‌లో స్మగ్లర్లు అడవుల్లోకి అధికారికంగా అడుగుపెడతారు. అరబ్ దేశాల్లో గద్దలకు భారీ డిమాండ్ ఉండటంతో వీటిని అక్రమ మార్గాల్లో తరలించేందుకు స్మగ్లర్లు నిత్యం వీటి వేటలో ఉంటారు. అయితే గద్దల అక్రమ వ్యాపారం విషయమై పాకిస్తాన్ ను వరల్డ్ వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది కూడా. ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్‌లో ప్రతీ ఏటా వెయ్యి వరకు గద్దలు చట్టవిరుద్ధంగా దేశం దాటుతున్నాయి.


పాకిస్తాన్‌లో ఇదో పెద్ద వ్యాపారం…

అరుదైన గుడ్లగూబలు, వాటి గుడ్లుకు అరబ్ దేశాల్లో డిమాండ్ ఉంది. వీటిని నల్లబజారులో విక్రయిస్తూ స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని రకాల డేగలు, గద్దలు, గుడ్లగూబలను పెంచుకోవడం దర్పంగా భావించే సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలకు వీటి స్మగ్లింగ్ భారీగా జరుగుతోందని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. 


దీని ఖరీదు రూ. 70 లక్షలు...

‘గ్రేట్ గ్రే’ రకం గుడ్లగూబలకు 1.20 లక్షల డాలర్ల(భారతీయ కరెన్సీలో రూ. 75 లక్షలు) వనరే ధర పలుకుతోందని స్వీడన్ పోలీసులు చెబుతున్నారు. మరి ఇంత డబ్బు పెట్టి కొనుక్కునే ఈ గద్దలను ఏచేసుకుంటారనే సందేహం ఎవరికైనా తలెత్తుతుంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని దర్పానికి చిహ్నంగా పెంచుకుంటుంటారు. వీటి పెంపకం కోసం ఓ అడవిని తలపింపజేసే ఏర్పాట్లుంటాయి. 


డేగలను  కుటుంబసభ్యుల్లా... 

గల్ఫ్ దేశాలకు చేరే డేగలను సొంత బిడ్డల్లా పెంచుకుంటారని అబుదాబిలోని ఫాల్కన్ హాస్పిటల్ డైరెక్టర్ మార్గీట్ మూలార్ అంచనా పేర్కొన్నారు. ఓ అంచనా ప్రకారం... ఈ ఆసుపత్రిలో ఏటా 10 వేల వరకు గద్దలు చికిత్స పొందుతున్నాయని వెల్లడించారు. పాకిస్తాన్ నుంచే కాకుండా మంగోలియా నుంచి కూడా గద్దలను తెప్పించుకుంటారని తెలుస్తోంది. మొత్తంమీద స్మగ్లర్లకు గద్దలు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. 

Updated Date - 2021-03-24T01:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising