ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై పోరుకు మేము సైతం...

ABN, First Publish Date - 2021-05-10T06:44:54+05:30

కొవిడ్‌పై పోరుకు కార్పొరేట్‌ సంస్థలు నడుం బిగించాయి. తాత్కాలిక అస్పత్రులు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లు సహా కీలక సరఫరాలతో అటు ప్రభుత్వానికి, ఇటు సామాన్య ప్రజలకు అండగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కదిలిన కార్పొరేట్‌ దిగ్గజాలు 
  • నిధులు, వస్తు రూపాల్లో సాయం

న్యూఢిల్లీ: కొవిడ్‌పై పోరుకు కార్పొరేట్‌ సంస్థలు నడుం బిగించాయి. తాత్కాలిక అస్పత్రులు, ఆక్సిజన్‌  ఉత్పత్తి యూనిట్లు సహా కీలక సరఫరాలతో అటు ప్రభుత్వానికి, ఇటు సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఇప్పటికే భారత్‌కు 1.8 కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు. అమెజాన్‌ వెయ్యి వెంటిలేటర్లు పంపిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వెయ్యి వెంటిలేటర్లతో పాటు 25,000 ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు సమకూరుస్తోంది. 

భారత కంపెనీలు: ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొవిడ్‌ రోగుల ఉచిత చికిత్స కోసం ముంబై, జామ్‌నగర్‌లో 1,875 బెడ్స్‌తో కూడిన రెండు తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసింది. జామ్‌నగర్‌లోని తన రిఫైనరీ నుంచి రోజుకు వెయ్యి టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. 

టాటా గ్రూపు: టాటా తన స్టీల్‌ ప్లాంట్ల నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. ఉచితంగా చికిత్సకు 5,000 పడకల తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసింది. 

ఐటీ కంపెనీలు: ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలు కూడా కొవిడ్‌పై పోరుకు తమ వంతు సహకరిస్తున్నాయి. కొన్ని చోట్ల తమ ప్రాంగణాలనే కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చాయి. 


Updated Date - 2021-05-10T06:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising