ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతాం..

ABN, First Publish Date - 2021-05-05T06:42:49+05:30

ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం.. ఎలకా్ట్రనిక్‌ హార్డ్‌వేర్‌ కంపెనీలను బాగానే ఆకర్షిస్తోంది. ఈ పథకం కింద భారత్‌లో తమ ఉత్పత్తి సామర్ధ్యం పెంచేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పీఎల్‌ఐ పథకంపై హార్డ్‌వేర్‌ కంపెనీల ఆసక్తి
  • ముందుకొచ్చిన డెల్‌, ఫాక్స్‌కాన్‌ సహా మరో 14 కంపెనీలు 

న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం.. ఎలకా్ట్రనిక్‌ హార్డ్‌వేర్‌ కంపెనీలను బాగానే ఆకర్షిస్తోంది. ఈ పథకం కింద భారత్‌లో తమ ఉత్పత్తి సామర్ధ్యం పెంచేందుకు 16 దేశ, విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో ఫాక్స్‌కాన్‌, డెల్‌, విస్ట్రాన్‌ వంటి విదేశీ కంపెనీలతో పాటు మైక్రోమాక్స్‌, లావా వంటి దేశీయ కంపెనీలూ ఉన్నట్టు కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ మంత్విత్వ శాఖ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి ప్రాతిపదికగా కంపెనీలు చేసే అదనపు ఉత్పత్తి విలువపై ప్రభుత్వం ఒకటి నుంచి నాలుగు శాతం వరకు పీఎల్‌ఐ పథకం కింద ప్రత్యేక ప్రోత్సాహకంగా అందిస్తుంది. ఈ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో దేశంలో రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వ అంచనా. ఇందులో రూ.1.35 లక్షల కోట్ల ఉత్పత్తి ఒక్క ఎలకా్ట్రనిక్స్‌ హార్ద్‌వేర్‌లో ఉంటుందని భావిస్తున్నారు. కీలక రంగాల్లో దిగుమతులు తగ్గించి దేశాన్ని అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. దీంతో దేశంలో ఉద్యోగ అవకాశాలూ పెరగనున్నాయి. 


Updated Date - 2021-05-05T06:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising