ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంక్రిమెంట్లకు కంపెనీలు రెడీ

ABN, First Publish Date - 2021-04-14T06:22:53+05:30

దేశంలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తున్నా కంపెనీలు కొత్త నియామకాలకు, ఉద్యోగులకు 5 నుంచి 10 శాతం జీతాలు పెంచేందుకూ రెడీ అంటున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త నియామకాలకూ ఓకే: జీనియస్‌ కన్సల్టెంట్స్‌ సర్వే


ముంబై: దేశంలో కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తున్నా  కంపెనీలు కొత్త నియామకాలకు, ఉద్యోగులకు 5  నుంచి 10 శాతం జీతాలు పెంచేందుకూ రెడీ అంటున్నాయి. ‘జీనియస్‌ కన్సల్టెంట్స్‌’ అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ సంస్థ ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,200 కంపెనీల ప్రధాన అఽధికారులతో మాట్లాడి ఈ నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 59 శాతం కంపెనీల ప్రధాన అధికారులు ఈ సంవత్సరం ఉద్యోగుల జీతా లు అయిదు నుంచి 10 శాతం పెంచుతామని చెప్పా రు. 20 శాతం కంపెనీలు మాత్రం ఆర్థిక పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుట పడనందున జీతాల పెంపు అయిదు శాతం కంటే తక్కువ స్థాయిలోనే ఉంటుందన్నారు. 21 శాతం కంపెనీలే జీతాల పెంపే ఉండదని స్పష్టం చేశాయి.


నియామకాలు:  ఈ ఏడాది కొత్త నియామకాలు చేపడతాముని 43 శాతం కంపెనీలు చెప్పాయి. 41 శాతం కంపెనీలు మాత్రం అదనపు నియామకాలు లేకపోయినా, ఉద్యోగాలు మానేసిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 


ఇతర ముఖ్యాంశాలు :

  • నియర్ల స్థాయిలోనే ఎక్కువ ఉద్యోగాలు.
  • ఇంటి నుంచి పనికి అలవాటు పడిన కంపెనీలు.
  • ఇంటి నుంచి పనితోనూ అదే పనితీరు, ఉత్పాదకత.
  • పెరగనున్న మహిళల సంఖ్య.

Updated Date - 2021-04-14T06:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising