ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెమికల్ కంపెనీల ర్యాలీ

ABN, First Publish Date - 2021-07-27T00:06:06+05:30

కెమికల్ కంపెనీల షేర్లు ఆల్‌టైం గరిష్టాన్ని తాకాయి. సోమవారం ఇంట్రా డే ట్రేడ్‌లో ఊహించని రీతిలో పుంజుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కెమికల్ కంపెనీల షేర్లు ఆల్‌టైం గరిష్టాన్ని తాకాయి. సోమవారం ఇంట్రా డే ట్రేడ్‌లో ఊహించని రీతిలో పుంజుకున్నాయి. ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, బాలాజీ అమైన్స్, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ షేర్లు బీఎస్‌ఈలో రికార్డ్‌ను నమోదు చేశాయి. ఈ రోజు ఇంట్రా డే ట్రేడ్‌లో ఈ స్టాక్స్ 11 శాతం ర్యాలీ చేశాయి. ఈ నాలుగు స్టాక్‌లతో పాటు, గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్, ఎన్‌ఓసీఐఎల్, గుజరాత్ హెవీ కెమికల్స్, సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్, దీపక్ నైట్రేట్, పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో గత నెలలో 8 శాతానికి పైగా లాభం సాధించి మార్కెట్‌ను అధిగమించాయి. 


ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చాలా కంపెనీలకు డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్‌ను విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత స్టాక్స్‌లో ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్ ఇంట్రా-డే ట్రేడ్‌లో 11 శాతం పెరిగి తరువాత కొత్తగా రూ. 4,490 ను తాకింది. అలిఫాటిక్ అమైన్స్‌కు డిమాండ్ పెరగడంతో కోవిడ్ -19 ప్రధాన లబ్ధిదారుల్లో ఈ సంస్థ ఒకటిగా నిలిచింది. పాండమిక్ తరువాత దాని ఉత్పత్తులకు అదిరిపోయే డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ షేర్లు 9 శాతం పెరిగి రూ. 1,730 లకు చేరుకున్నాయి. గత నెలలో ఈ స్టాక్ 60 శాతం జూమ్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 110.26 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది రూ. 46.79 కోట్లుగా నమోదైంది. 

Updated Date - 2021-07-27T00:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising