ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడ్కరీ వ్యాఖ్యపై సిమెంట్ కంపెనీల ఆగ్రహం...

ABN, First Publish Date - 2021-01-13T21:58:20+05:30

కేంద్ర మంత్రి నితిన్ గట్కరీ వ్యాఖ్యలపై సిమెంట్ కంపెనీలు తారస్థాయిలో ధ్వజమెత్తాయి. గడ్కరీ ఆరోపణలను ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ, సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎస్‌ఐసీఎంఏ) ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గట్కరీ వ్యాఖ్యలపై సిమెంట్ కంపెనీలు తారస్థాయిలో ధ్వజమెత్తాయి. గడ్కరీ ఆరోపణలను ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎండీ, సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎస్‌ఐసీఎంఏ) ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ ఖండించారు. సిమెంట్ ఉత్పత్తిదారులు ఒక్కటై... సిమెంట్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు.  భవన నిర్మాణ వ్యయంలో సిమెంట్ పాత్ర స్వల్పమని, బిల్డర్స్ 100 % పైగా మార్జిన్ ఉంచుకొని ఇళ్ల ధరలను నిర్ణయిస్తున్నారని, అదీ కాకుండా పెరిగిన ఇళ్ల ధరలకు సిమెంట్ కంపెనీలను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బిల్డర్లు ఇలా ఆరోపిస్తున్నారన్నారు. బిల్డర్స్ లాబీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ ద్వారా కోరారు. ప్రతి బిల్డర్ ధర విషయంలో పారదర్శకంగా ముందుకు రావడం ద్వారా ఇళ్ల ధరలను దాదాపు 50 % తగ్గించవచ్చని, అదే విధంగా చెక్కుల రూపంలో లావాదేవీలు జరపనిపక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 


Updated Date - 2021-01-13T21:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising