ఎల్‌ఐసీ ఇష్యూకి సీసీఈఏ అనుమతి
ABN, First Publish Date - 2021-07-13T05:53:55+05:30
ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)
న్యూఢిల్లీ: ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి నాయకత్వంలోని ఒక ప్యానెల్ వాస్తవంగా ఎన్ని వాటాలు విక్రయించాలనేది నిర్ణయించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించనున్న ఈ ఐపీఓకి అనుగుణంగా ఎల్‌ఐసీ వాస్తవ విలువను నిర్ధారించేందకు మిల్లిమాన్ అడ్వైజర్స్‌ను కన్సల్టెంట్‌గా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ జనవరిలో నియమించింది. త్వరలోనే ఆ సంస్థ వాస్తవ విలువను నిర్ధారిస్తుందంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఇష్యూ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇష్యూ పరిమాణంలో 10 శాతం పాలసీదారులకు కేటాయిస్తారు.
Updated Date - 2021-07-13T05:53:55+05:30 IST