ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధి రేటు 10.2 శాతమే

ABN, First Publish Date - 2021-04-22T06:44:11+05:30

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను కేర్‌ రేటింగ్స్‌ మరింత తగ్గించింది. కొవిడ్‌ రెండో దశ ఉధృతి నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 10.2 శాతం మించదని అంచనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేర్‌ రేటింగ్స్‌ 


న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను  కేర్‌ రేటింగ్స్‌ మరింత తగ్గించింది. కొవిడ్‌ రెండో దశ ఉధృతి నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 10.2 శాతం మించదని అంచనా వేసింది. కొవిడ్‌ ఉధృతిని బట్టి మే నెలలో ఈ అంచనాలను మరోసారి సవరించే అవకాశం ఉందని తెలిపింది. కేర్‌ రేటింగ్స్‌ భారత జీడీపీ అంచనాలను సవరించడం గత నెల రోజుల్లో ఇది మూడోసారి. గత నెల 24న ఇదే సంస్థ 2021 -22లో జీడీపీ వృద్ధి రేటు 11 నుంచి 11.2 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దీన్ని 10.7 నుంచి 10.9 శాతానికి కుదించింది. కుంభమేళా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముందు జాగ్రత్త చర్యల్ని గాలికి  వదిలేయడమే ప్రస్తుత సమస్యకు కారణమని స్పష్టం చేసింది. పోలింగ్‌ ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ఐదు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై కొవిడ్‌ ప్రభావాన్ని అంచనా వేయనున్నట్టు తెలిపింది.


Updated Date - 2021-04-22T06:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising