ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనరా బ్యాంక్‌ రూ.1,500 కోట్ల సమీకరణ

ABN, First Publish Date - 2021-12-03T07:37:23+05:30

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. రూ.1,500 కోట్ల నిధులను సమీకరించింది. బాసెల్‌ -3 ప్రమాణాలకు అనుగుణంగా బాండ్లను జారీ చేయటం ద్వారా ఈ మొత్తాలను సమీ కరించినట్లు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. రూ.1,500 కోట్ల నిధులను సమీకరించింది. బాసెల్‌ -3 ప్రమాణాలకు అనుగుణంగా బాండ్లను జారీ చేయటం ద్వారా ఈ మొత్తాలను సమీ కరించినట్లు వెల్లడించింది. అదనపు టైర్‌-1 బాండ్ల జారీ ద్వారా రూ.,500 కోట్ల నిధులను సమీకరించాలని భావించగా రూ.4,699 కోట్ల మొత్తానికి బిడ్లు వచ్చాయని కెనరా బ్యాంక్‌ తెలిపింది. అయితే ఏటా 8.05 శాతం కూపన్‌ రేటుతో రూ.1,500 కోట్ల నిధులను తీసుకోవాలని బ్యాంక్‌ నిర్ణయించి ఆమోదం తెలిపిందని పేర్కొంది. 


గృహ రుణ వడ్డీ రేటు 6.65 శాతం: వినియోగదారులకు అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలను ఆఫర్‌ చేస్తున్నట్లు కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. అన్ని రకాలైన గృహ రుణాలకు సంబంధించి 6.65 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఆఫర్‌ పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. రుణాలను సత్వరమే మంజూరు చేసే విధంగా ప్రాసెసింగ్‌ ఫీజు, డాక్యుమెంటేషన్‌ చార్జీలను మినహా యిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయటం ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా గృహ రుణానికి దరఖాస్తు చేసుకునే అవకాశంతో పాటు ఇన్‌స్టంట్‌గా ఆమోదం తెలిపే విధానాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. కారు, విద్య, బంగారు, వ్యక్తిగత రుణాలకు కూడా ఈ స్కాన్‌ అండ్‌ అప్లై, ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ విధానం అందు బాటులో ఉంటుందని కెనరా బ్యాంక్‌ వెల్లడించింది. 

Updated Date - 2021-12-03T07:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising