ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాక్ మార్క్టెట్లలో ‘బుల్ రన్’ కొనసాగుతుంది : ఝన్‌ఝన్‌వాలా...

ABN, First Publish Date - 2021-06-21T20:07:17+05:30

స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆందోళన అవసరం లేదని స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆందోళన అవసరం లేదని స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు రాకేష్ ఝన్‌ఝన్‌వాలా పేర్కొన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం గురించిన కలవరం అక్కర్లేదని, అది ఓ వైపు కొనసాగుతుందని, స్టాక్ మార్క్టెట్లలో బుల్ రన్ కొనసాగుతుందని చెప్పారు. ఇక... కోవిడ్ థర్డ్ వేవ్ గురించిన భయం కూడా అక్కర్లేదని పేర్కొన్నారు. 


చిన్నపాటి కరెక్షన్ల గురించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఓవరాల్‌గా మార్కెట్లు బ్రహ్మాండంగా లాభాలు పంచుతాయని ఝన్‌ఝన్‌వాలా స్పష్టం చేశారు. మొత్తంగా సోమవారం నష్టాలతో కలిపి మూడు శాతం వరకు నష్టపోయిన నేపధ్యంలో... ఝన్‌ఝన్‌వాలా అభిప్రాయానికి ప్రాథాన్యత ఏర్పడింది. 


కరోనా థర్డ్ వేవ్ గురించి ఆయన అభిప్రాయం ఇలా ఉంది. ‘సెకండ్ వేవ్ గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతున్నారు.ఓ వైపు టీకాలు భారీగా వేస్తున్న తరుణంలో ఇమ్యూనిటీ పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో... మూడో వేవ్ అనేది అంతగా ప్రభావం చూపుతుందనుకోవడంలేదు’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-21T20:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising