ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఐసీ ఉద్యోగులకు బొనాంజా

ABN, First Publish Date - 2021-04-17T06:41:26+05:30

భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల వేతనాలు 16 శాతం పెంచేందుకు మేనేజ్‌మెంట్‌ అంగీకరించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

16 శాతం పెరిగిన వేతనాలు 


న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల వేతనాలు 16 శాతం పెంచేందుకు మేనేజ్‌మెంట్‌ అంగీకరించింది. 2017 ఆగస్టు నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది.  సంస్థ పబ్లిక్‌ ఇష్యూ కన్నా ముందే తమ వేతన సవరణ తేల్చాలని ఎల్‌ఐసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు వారానికి ఐదు రోజుల పని విధానానికి కూడా మేనేజ్‌మెంట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఇక ప్రతి శనివారం కూడా ఎల్‌ఐసీ కార్యాలయాలు పని చేయవు. ఉద్యోగుల గృహ రుణాలపై వడ్డీని ఒక శాతం తగ్గించేందుకూ కూడా యాజమాన్యం అంగీకరించింది. దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ ఇష్యూ ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2021-04-17T06:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising