ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆజాద్‌ ఇంజనీరింగ్‌కు బోయింగ్‌ కాంట్రాక్టు

ABN, First Publish Date - 2021-07-27T05:51:38+05:30

కీలకమైన విమాన విడి భాగాలు తయారు చేసి సరఫరా చేయడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కీలకమైన విమాన విడి భాగాలు తయారు చేసి సరఫరా చేయడానికి బోయింగ్‌ నుంచి హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు పొందింది. బోయింగ్‌కు విడిభాగాలు సరఫరా చేయడానికి కాంట్రాక్టు పొందడం గర్వకారణంగా ఉందని ఆజాద్‌ ఇంజనీరింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ చోప్‌దార్‌ అన్నారు. కంపెనీ సామర్థ్యం, కంపెనీపై ఉన్న విశ్వసనీయతకు ఇది గుర్తింపని తెలిపారు. టర్బైన్‌లు, ఏరోస్పేస్‌ ఇండస్ట్రీ్‌సకు కావాల్సిన క్లిష్టమైన పరికరాలను ఆజాద్‌ ఇంజనీరింగ్‌ తయారు చేస్తోంది.


బోయింగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైడ్రాలిక్‌, మెకానికల్‌ ఫిట్టింగ్స్‌ తదితరాలను సరఫరా చేయనుంది. 2022 మొదటి త్రైమాసికం నుంచి ఈ పరికరాలను కంపెనీ అందిస్తుంది. గత రెండేళ్లలో భారత్‌ నుంచి బోయింగ్‌ సమకూర్చుకుంటున్న పరికరాల విలువ నాలుగింతలై 100 కోట్ల డాలర్లకు మించినట్లు బోయింగ్‌ ఇండియా సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ అశ్వనీ భార్గవ అన్నారు.

Updated Date - 2021-07-27T05:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising