ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్‌కు భారీ షాక్..! రిలయన్స్‌-ఫ్యూచర్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్!

ABN, First Publish Date - 2021-01-21T20:45:35+05:30

రిటైల్ ఆస్తులను రిలయన్స్‌కు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్‌కు ప్రయత్నాలకు కొత్త ఊపు వచ్చింది. ఈ డీల్ ముందుకు సాగచ్చంటూ భారత స్టాక్ ఎక్సెంజ్‌లు బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రిటైల్ ఆస్తులను రిలయన్స్‌కు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్‌కు ప్రయత్నాలకు కొత్త ఊపు వచ్చింది. ఈ డీల్ ముందుకు సాగచ్చంటూ భారత స్టాక్ ఎక్సెంజ్‌లు బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ ఒప్పందం పట్ల అభ్యంతరాలు కానీ ప్రతికూల అభిప్రాయాలు గానీ తమకు లేవని స్పష్టం చేశాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమాచారం ఇచ్చామని కూడా అవి పేర్కొన్నాయి. దీంతో ఫ్యూచర్ రిలయన్స్ డీల్ విషయంలో కీలక ముందడుగు పడినట్టైంది. కాగా.. ఈ ఒప్పందం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అమెజాన్‌కూ ఈ పరిణామం కారణంగా ఊహించని షాక్ తగిలినట్టైంది. ఈ కామర్స్ రంగంలో రిలయన్స్ అమెజాన్‌కు ప్రధాన పోటీదారు కాబోతోందన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.


రిలయన్స్‌తో డీల్‌కు సంబంధించి అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతంలో అమెజాన్‌తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందంలోని కొన్ని నిబంధనలను ఈ కొత్త డీల్ ఉల్లంఘిస్తోందనేది అమెజాన్ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో అమెజాన్ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేటర్‌నూ ఆశ్రయించింది. ఈ క్రమంలో తుది తీర్పు వెలువడే వరకూ రిలయన్స్‌తో డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆర్బిట్రేటర్ గత ఏడాది ఆక్టోబర్‌లో తీర్పు వెలువరించింది. అయితే.. రిలయన్స్‌తో ఒప్పందానికి సంబంధించినంత వరకూ సింగపూర్ ఆర్బిట్రేటర్ తీర్పుకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో డీల్ నిలిపివేత తీర్పును అమెజాన్ సంస్థ పలు లేఖల ద్వారా సెబీకి దృష్టికి కూడా తెచ్చింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టులో ఈ డీల్‌కు సంబంధించి వాదోపవాదాలు నడుస్తున్న విషయాన్నీ కూడా ప్రస్తావించింది. 


తాజాగా భారత్ స్టాక్ ఎక్సేంజీలు తాజాగా ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.  సెబీతో చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నాయి. ఈ డీల్‌తో పాటూ అమెజాన్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్‌తో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌తో పంచుకోవాలని స్పష్టం చేస్తుంది. అమెజాన్-ఫ్యూచర్ డీల్‌కు ఎన్‌సీఏఎల్‌టీ కూడా అనుమతించాల్సి ఉంటుంది. కాగా.. ఈ పరిణామంపై అమెజాన్ కూడా స్పందించింది. ఈ విషయమై ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని పేర్కొంది. అంతేకాకుండా..స్టాక్ మార్కెట్ అనుమతులన్నీ సింగపూర్ ఆర్బిట్రేటర్ తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయిన కూడా స్పష్టం చేసింది.

Updated Date - 2021-01-21T20:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising