ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బిట్‌కాయిన్’కు మళ్ళీ డిమాండ్...

ABN, First Publish Date - 2021-03-04T23:30:47+05:30

క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌కు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ కరెన్సీ వ్యాల్యూ బుధవారం 5 శాతం ఎగబాకి 50,942 పాయింట్లను దాటింది. కిందటి సెషన్‌లో 2,426 డాలర్లకు పైగా లాభపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 4 న 27,734 డాలర్లు పలికిన విషయం గుర్తుండే ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌కు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ కరెన్సీ వ్యాల్యూ బుధవారం 5 శాతం ఎగబాకి 50,942 పాయింట్లను దాటింది. కిందటి సెషన్‌లో 2,426 డాలర్లకు పైగా లాభపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 4 న 27,734 డాలర్లు పలికిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక అప్పటినుండి ఈ రోజు(గురువారం) వరకు 84 శాతం మేర లాభపడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21 న ఆల్ టైమ్ గరిష్టం... 58,354 డాలర్లను తాకింది. ఆ తర్వాత దారుణంగా పడిపోయి 45 వేల డాలర్ల దిగువకు చేరుకుంది. మళ్లీ పుంజుకొని ఇప్పుడు 51 వేల డాలర్ల దిశగా సాగుతోంది.


బిట్ కాయిన్ ఎగుడుదిగుళ్ళు...

జనవరి, ఫిబ్రవరి నెలల్లో బిట్ కాయిన్ భారీగా లాభపడటానికి పలు కారణాలున్నాయి. బీఎన్‌వై మెలన్, మాస్టర్ కార్డ్, టెస్లా స్క్వేర్ ఇంక్ వంటి దిగ్గజ సంస్థలు బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడమో, ఈ క్రిప్టో కరెన్సీని అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేయడమో చేశాయి. ఈ క్రమలో బిట్‌కాయిన్... ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత టెస్లా అధినేత చేసిన ట్వీట్, బిట్ కాయిన్‌కు ఇప్పటికే హైజంప్ వచ్చిందనే వాదనల నేపధ్యంలో ‘విలువ’ పడిపోయింది. మళ్ళీ... మార్చి 3 న 50 వేల పాయింట్లను తాకింది. ఓ దశలో ఆల్ టైమ్ హై ఫిబ్రవరి 21 నాటి 58,354 డాలర్లతో పోల్చుకుంటే 12 శాతం క్షీణించింది.


ఈ క్రిప్టో వ్యాల్యూ కూడా జంప్...

ఇక మరో క్రిప్టోకరెన్సీ ఎథెర్ విలువ బుధవారం 7 శాతానికి పైగా ఎగసింది. ఎథెరియమ్ బ్లాక్ చైన్ నెట్ వర్క్‌కు చెందిన ఎథేర్ క్రిప్టో నిన్న 1,595.64 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 106.84 డాలర్లు ఎగిసింది. ఇటీవల ఇతర క్రిప్టో కరెన్సీల విలువ కూడా పెరుగుతోన్న విషయం తెలిసిందే.


భారత్‌లో రెట్టింపు...

ఇదిలా ఉండగా, భారత్‌లో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ నెల ప్రాతిపదికన ఫిబ్రవరి నెలలో రెండింతలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు క్రిప్టోను బ్యాన్ చేయనుందనే వార్తల నేపధ్యంలో... విలువ పెరగడం గమనార్హం. డిసెంబరు 2020 లో క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ విలువ 500 మిలియన్ డాలర్లు కాగా, జనవరి 21 న 1.4 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 2.3 బిలియన్ డాలర్లకు పెరిగింది.

Updated Date - 2021-03-04T23:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising