ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ షేర్స్.. త్రైమాసిక ఫలితాలకు ముందే రికార్డ్ ‘హై’కి స్టాక్...

ABN, First Publish Date - 2021-07-29T23:14:50+05:30

త్రైమాసిక ఫలితాలు వెలువడక ముందే స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్‌బీఐ) షేర్లకు మంచి ఊపొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : త్రైమాసిక ఫలితాలు వెలువడక ముందే స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్‌బీఐ) షేర్లకు మంచి ఊపొచ్చింది. స్టాక్... రికార్డ్ హైకి చేరుకుంది. భారీ వాల్యూమ్‌ల నేపధ్యంలో గురువారం ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో స్టేట్  ఎస్‌బీఐ షేర్లు మూడు శాతం పెరిగి రూ. 438.60 కి చేరుకున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికం ఫలితాలు వచ్చే వారం వెలువడాల్సి ఉండగా, అంతకంటే ముందే స్టాక్ రికార్డు హైకి చేరింది. రికవరీలు, నిరాడంబరమైన ఒపెక్స్ మద్దతుతో ఎస్‌బీఐ మంచి పురోగతి కనబరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


మార్చి 2021 త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ఎస్‌బీఐ సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... స్టాక్ 2021 జూన్ 3 న ఆల్‌టైమ్ గరిష్టం రూ. 442 లకు చేరింది. అప్పటినుంచి ఇది ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 0.66 శాతం పెరుగుదలతో పోలిస్తే, 3.4 శాతం పడిపోయి, మార్కెట్‌లో నిరాశాజనకమైన పనితీరును కనబరచింది.  కౌంటర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్‌లు 1.5 రెట్లు పెరిగాయి. మొత్తం 18.36 మిలియన్ ఈక్విటీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈపై మధ్యాహ్నం 01:40 గంటల వరకు చేతులు మారాయి.

Updated Date - 2021-07-29T23:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising