ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చిలో... పదకొండు రోజులు బ్యాంకు సెలవులు.... మరో రెండు రోజులు సమ్మె...

ABN, First Publish Date - 2021-02-28T22:09:23+05:30

మార్చి నెలలో బ్యాంకులకు ఆరు రోజులు సాధారణ సెలవులతోపాటు మరో ఐదు రోజులు అదనంగా సెలవులు వస్తున్నాయి. వీటితోపాటు రెండు రోజులపాటు బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగే అవకాశముంది. వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మార్చి నెలలో బ్యాంకులకు ఆరు రోజులు సాధారణ సెలవులతోపాటు మరో ఐదు రోజులు అదనంగా సెలవులు వస్తున్నాయి. వీటితోపాటు రెండు రోజులపాటు బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగే అవకాశముంది. వివరాలిలా ఉన్నాయి.


రిజర్వ్ బ్యాంకు నిబంధనల నేపధ్యంలో రాష్ట్రాలను బట్టి సెలవులుంటాయన్న విషయం తెలిసిందే.కాగా... మార్చి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 11 రోజుల వరకు మూతపడనున్నాయి. ప్రతి నెలా సాధారణంగా నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు సెలవు దినాలుంటాయి. రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో వివిధ రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు ఉండనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయి. మార్చి 5, 11, 22, 29, 30 తేదీల్లో బ్యాంకులకు సెలవులుంటాయని ఆర్‌బీఐ మార్గదర్శకాలు వెల్లడించాయి. మార్చి 11(గురువారం)న మహాశివరాత్రి, మార్చి 30(మంగళవారం)న హోలీ పండుగలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు రోజుల్లో మనదగ్గర బ్యాంకులకు సెలవులు ప్రకటించనున్నారు.


ఇక మార్చి నెల మధ్యలో బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం పలు బ్యాంకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో యూనియన్లు సమ్మె ద్వారా నిరసన చేపట్టాలని భావిస్తున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకు యూనియన్లు సమ్మె చేపట్టేందుకు సంబంధిత యూనియన్‌లు సిద్ధమవుతున్నాయి. 


మార్చి 2021 లో బ్యాంకు సెలవులు...

5 మార్చి : చాప్చెర్ కుట్,

7 మార్చి : ఆదివారం,

11 మార్చి : మహాశివరాత్రి,

13 మార్చి : రెండో శనివారం,

14 మార్చి : ఆదివారం,

22 మార్చి : బిహార్ డే,

27 మార్చి : నాలుగో శనివారం,

28 మార్చి : ఆదివారం,

29 మార్చి : ధులేటి/యావోసాంగ్ సెకండ్ డే,

30 మార్చి : హోలీ. 

Updated Date - 2021-02-28T22:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising