ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాన బ్యాంకుల ప్రైవేటీకరణ.. వినియోగదారులపై ప్రభావం...

ABN, First Publish Date - 2021-03-26T20:47:27+05:30

బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... నాలుగు బ్యాంకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో...  నాలుగు బ్యాంకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను  ప్రైవేటీకరించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటి నాటి బడ్జెట్‌లో బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం వెలువడిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రణాళికలున్నాయి. ప్రైవేటీకరణ జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ పేరు ఉన్నాయి. అయితే దీనిపై ఇంతవరకు స్పష్టమైన నిర్ణయాన్ని మాత్రం ఇంకా తీసుకోలేదు.


ఇక ఈ నాలుగు బ్యాంకుల్లో రెండు బ్యాంకులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించనున్నాకె, బ్యాంకింగ్ రంగంలో, మొదటి దశ ప్రైవేటీకరణలో భాగంగా మిడ్-సైజ్, చిన్న బ్యాంకులలో వాటాను విక్రయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో, ప్రభుత్వం దేశంలోని మరికొన్ని ఇతర పెద్ద బ్యాంకులపై కూడా ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్లు వినవస్తోంది.  దేశంలో ఐదు  బ్యాంకులు మాత్రమే ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వీఎం పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ హెడ్ వివేక్ మిట్టల్ పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల విలీనం జరుగుతుందని, లేదంటే ప్రైవేటుపరమవుతాయని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-26T20:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising