ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దశాబ్ది కనిష్ఠానికి గృహ రుణ వడ్డీ రేట్లు

ABN, First Publish Date - 2021-03-08T06:36:38+05:30

గృహ రుణాల మార్కెట్‌లో పోటీ పెరిగి పోయింది. మంచి క్రెడిట్‌ స్కోరు, స్థిరాదాయం ఉంటే చాలు....గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెంటపడుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్యాంకుల వద్ద దండిగా నిధులు


ముంబై: గృహ రుణాల మార్కెట్‌లో పోటీ పెరిగి పోయింది. మంచి క్రెడిట్‌ స్కోరు, స్థిరాదాయం ఉంటే చాలు....గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెంటపడుతున్నాయి. ప్రస్తుతం కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ 6.65 శాతం, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ 6.7 శాతం కనీస వడ్డీ రేటుకే  గృహ రుణాలు ఇస్తున్నాయి. ఎస్‌బీఐ  ప్రాసెసింగ్‌ ఫీజు కూడా రద్దు చేసింది. హెడీఎ్‌ఫసీ  కూడా ఇపుడు ఇంచుమించు ఇదే వడ్డీరేట్లకు రుణాలు ఇస్తోంది. ఒక్క హెచ్‌డీఎ్‌ఫసీ తప్ప దాదాపు అన్ని బ్యాంకులు ఈ నెలాఖరు వరకే ఈ ఆఫర్‌ను పరిమితం చేశాయి. దేశంలో గృహ రుణాలపై వడ్డీరేట్లు ఇప్పుడున్న  స్థాయికి పడిపోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి. 

గత రెండేళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కుంటుతోంది. కోవిడ్‌తో ఈ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో పారిశ్రామిక, వ్యాపార రంగాల నుంచి బ్యాంకు రుణాలకు గిరాకీ పడిపోయింది. ఒకవేళ ఎవరైనా అడిగినా ఎన్‌పీఏల భయంతో బ్యాంకులు సవాలక్ష షరతులు పెడుతున్నాయి. దీంతో బ్యాంకుల వద్ద దండిగా నిధులు పేరు కు పోయాయి. గత వారాంతానికి బ్యాంకుల వద్ద దాదా పు రూ.5 లక్షల  కోట్ల మిగులు నిధులున్నట్టు అంచనా. దీంతో ఈ నెలాఖరు వరకు ప్రత్యేక ఆఫర్ల పేరుతో తక్కువ వడ్డీ రేట్లతో హోమ్‌ లోన్లు ఆఫర్‌ చేస్తున్నాయని భావిస్తున్నారు. 

చెల్లింపులకు భద్రత 

మిగతా రుణాలతో పోలిస్తే గృహ రుణాల చెల్లింపుల కు భద్రత ఎక్కువ. రుణం పూర్తిగా తీర్చే వరకు ఆ ఆస్తి ని బ్యాంకులు హామీగా పెట్టుకుంటాయి. ఖాతాదారు రుణ చెల్లింపుల్లో ఏ మాత్రం విఫలమైనా ఆ ఆస్తిని వేలం వేసి, తమ బకాఇలు రాబట్టుకుంటాయి. దీంతో మార్కెట్‌లో దాదాపు 34 శాతం వాటా ఉన్న ఎస్‌బీఐ హోమ్‌ లోన్ల పోర్టుఫోలియోను చూస్తే ఎన్‌పీఏల శాతం 0.67 శాతం మాత్రమే.


Updated Date - 2021-03-08T06:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising