ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో బ్యాంక్‌ డిపాజిట్ల బీమా సవరణ బిల్లు

ABN, First Publish Date - 2021-05-17T06:23:33+05:30

బ్యాంక్‌ డిపాజిట్ల బీమా సవరణ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి ఈ బిల్లును బడ్జెట్‌ సమావేశాల్లోనే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్యాంక్‌ డిపాజిట్ల బీమా సవరణ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి ఈ బిల్లును బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే కొవిడ్‌ కారణంగా బడ్జెట్‌ సమావేశాలను కుదించడంతో అది కుదరలేదు. బ్యాంక్‌ డిపాజిట్ల బీమా హామీ పరిమితిని ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. అయితే ఇందుకోసం డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌  గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసి) చట్టానికి సవరణ చేయాల్సి ఉంది. ఈ సవరణకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే బ్యాంకుల లైసెన్సులు రద్దయినా లేదా అవి దివాలా ప్రక్రియకు వెళ్లినా రూ.5 లక్షల వరకు ఉన్న డిపాజిట్లకు చెల్లింపుల రక్షణ లభిస్తుంది.  


Updated Date - 2021-05-17T06:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising