ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరబిందో చేతికి క్రోనస్‌ ఫార్మా స్పెషాలిటీస్‌

ABN, First Publish Date - 2021-08-13T07:46:25+05:30

హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ ఔషధాల సంస్థ క్రోనస్‌ ఫార్మాస్పెషాలిటీ్‌సను అరబిందో ఫార్మా హస్తగతం చేసుకుంది. ఈ కంపెనీ లో రూ.420 కోట్లతో 51 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.420 కోట్లతో 51శాతం వాటా కొనుగోలు 
  • త్రైమాసిక లాభం రూ.770 కోట్లు
  • 3 ఇంజెక్టబుల్స్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ ఔషధాల సంస్థ క్రోనస్‌ ఫార్మాస్పెషాలిటీ్‌సను అరబిందో ఫార్మా హస్తగతం చేసుకుంది. ఈ కంపెనీ లో రూ.420 కోట్లతో 51 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా అరబిందో ఫార్మాకు కొత్త షేర్లను జారీ చేస్తారు. జెనరిక్‌ వెటర్నరీ ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయా ల్లో క్రోనస్‌ ఫార్మా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015లో ఏర్పాటైన ఈ కంపెనీ టర్నోవర్‌ 2020-21 లో రూ.11.4 కోట్లుగా ఉంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ను రూ.34.18 ప్రీమియం చెల్లించి అరబిందో కొనుగోలు చేస్తోంది.  


ఆదాయం రూ.5,702 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి అరబిందో ఫార్మా ఏకీకృత ప్రాతిపదికన రూ.770 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.707 కోట్లతో పోలిస్తే 8.9 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 2.9 శాతం వృద్ధితో రూ.5,540 కోట్ల నుంచి రూ.5,702 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. ఏడాది క్రితంతో పోలిస్తే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అమెరికా ఫార్ములేషన్ల విక్రయాల్లో మార్పులేదని, రూ.2,681 కోట్లుగా నమోదయ్యాయని కంపెనీ వివరించింది. యూరప్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు మాత్రం 20 శాతం పెరిగి రూ.1,583 కోట్లకు చేరాయి. 



150శాతం మధ్యంతర డివిడెండ్‌


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అరబిందో ఫార్మా వాటాదారులకు 150 శాతం మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై కంపెనీ బోర్డు రూపాయిన్నర మధ్యంతర డివిడెండ్‌ను సిఫారసు చేసింది. సమీక్షా త్రైమాసికంలో పరిశోధన అభివృద్ధిపై కంపెనీ రూ.358 కోట్లు ఖర్చు చేసింది. 3 ఇంజెక్టబుల్స్‌తో సహా 4 ఏఎన్‌డీఏలకు యూఎ్‌సఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. తొలి త్రైమాసిక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ అన్నారు. మొత్తం ఫార్ములేషన్ల విక్రయాలు 2.7 శాతం పెరిగి రూ.4,890 కోట్లకు చేరినట్లు చెప్పారు.

Updated Date - 2021-08-13T07:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising