ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పీఎల్‌ఐ’లో 3 ఉత్పత్తుల తయారీ

ABN, First Publish Date - 2021-02-26T09:52:20+05:30

ఉత్పత్తితో ముడిపడి న ప్రోత్సాహాకాల (పీఎల్‌ఐ) పథకం కింద దాదాపు రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అరబిందో ఫార్మా భావిస్తోంది. పీఎల్‌ఐ కింద కంపెనీకి 3

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.3,000 కోట్ల పెట్టుబడులు: అరబిందో


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఉత్పత్తితో ముడిపడి న ప్రోత్సాహాకాల (పీఎల్‌ఐ) పథకం కింద దాదాపు రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అరబిందో ఫార్మా భావిస్తోంది. పీఎల్‌ఐ కింద కంపెనీకి 3 ఉత్పత్తులను కేటాయించారు. ఈ ఉత్పత్తులకు సంబంధించి కొన్ని సందేహాలపై ప్రభుత్వం సమాధానం కోరిందని, వివరణ అందిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా మూడు లేదా రెండు ఉత్పత్తులపై కంపెనీ ముందుకు వెళ్లే వీలుందని అరబిందో ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోవిందరాజన్‌ తెలిపారు. మూడు ఉత్పత్తుల తయారీ చేపడితే.. వచ్చే 30-32 నెలల్లో దాదాపు రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. ఈ మూడు ఉత్పత్తులకు ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. వచ్చే నాలుగైదేళ్లలో ఏపీఐ ఉత్పత్తిని రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. జెనరిక్‌ ఇంజెక్టబుల్స్‌ విక్రయాలు వచ్చే మూడేళ్లలో 65-70 కోట్ల డాలర్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 

=====================

Updated Date - 2021-02-26T09:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising