ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుగా అరబిందో ఇంజెక్టబుల్స్‌ వ్యాపారం!

ABN, First Publish Date - 2021-04-16T05:54:48+05:30

ఇంజెక్టబుల్స్‌ వ్యాపారాన్ని వేరు చేయాలని అరబిందో ఫార్మా యోచిస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇంజెక్టబుల్స్‌ వ్యాపారాన్ని వేరు చేయాలని అరబిందో ఫార్మా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బోర్డు ఆమోదాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా వేస్తున్నారు. లిక్విడ్‌, లియోఫిలైజ్డ్‌ వైయల్స్‌, యాంపుల్స్‌, ప్రీఫిల్డ్‌ సిరంజ్‌లు మొదలైన అన్ని ఇంజెక్టబుల్స్‌ను అరబిందో ఫార్మా తయారు చేస్తోంది. ఇంజెక్టబుల్స్‌ను తయారు చేయడానికి వివిధ దేశాలకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన ఐదు అత్యాధునిక తయారీ యూనిట్లు ప్రస్తుతం కంపెనీకి ఉన్నాయి. 


అమెరికా మార్కెట్‌ కోసం యూఎస్‌లో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతోంది. దీంతోపాటు యూరప్‌, ఇతర దేశాల మార్కెట్ల కోసం విశాఖపట్నంలో ప్రత్యేక ఇంజెక్టబుల్స్‌ తయారీ యూనిట్‌ను కంపెనీ ప్రారంభించనుంది. అమెరికా, యూరప్‌, కెనడా, వర్థమాన దేశాలకు చెందిన ఇంజెక్టబుల్‌ మార్కెట్లలో అరబిందోకు పట్టు ఉంది.  అమెరికాలో వాణిజ్య ఇంజెక్టబుల్స్‌ మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా కలిగిన నాలుగు కంపెనీల్లో అరబిందో ఒకటి. 


Updated Date - 2021-04-16T05:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising