ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon Prime Day Sale.. మొబైల్స్‌పై అదిరే ఆఫర్లు

ABN, First Publish Date - 2021-07-26T22:41:36+05:30

అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది. కరోనా కారణంగా కొన్ని వారాలపాటు వాయిదాపడిన సేల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది. కరోనా కారణంగా కొన్ని వారాలపాటు వాయిదాపడిన సేల్ ఎట్టకేలకు నేడు లైవ్‌లోకొచ్చింది. రెండు రోజులపాటు కొనసాగున్న ఈ సేల్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, అమెజాన్ డివైజెస్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.


అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా రూ. 54,900 విలువైన యాపిల్ ఐఫోన్ 11ను రూ. 47,999కే అందుబాటులో ఉంచింది. బండిల్డ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో భాగంగా మరో రూ. 13,400 తగ్గింపు లభిస్తుంది. క్రెడిట్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, రూ. 79,900 విలువైన ఐఫోన్ 12ను ప్రస్తుతం 67,999కే విక్రయిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌తో కనుక దీనిని ఎక్స్‌చేంజ్ చేసుకుంటే అదనంగా మరో రూ.13,400 తక్షణ రాయితీ లభిస్తుంది. 


వన్‌ప్లస్ 9 5జీపై అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో నేరుగా రూ. 4 వేల రాయితీ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌‌తో ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 13,400 తక్షణ రాయితీ లభిస్తుంది. వన్‌ప్లస్ 9 5జీని ఇప్పుడు రూ. 45,999కే సొంతం చేసుకోవచ్చు.


అలాగే, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జి20, ఫైర్ టీవీ స్టిక్, కిండల్ ఈ బుక్ రీడర్స్, ఎకో డాట్, విప్రో 9వాట్స్ స్మార్ట్ బల్బ్, యాపిల్ వాచ్ ఎస్ఈ,  సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, సోనీ బ్రేవియా 55 అంగుళాల 4కె స్మార్ట్ టీవీ, హెచ్‌పీ పెవిలియన్ 15 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ వంటి వాటిపై భారీ రాయితీలను ఆఫర్ చేస్తోంది.  

Updated Date - 2021-07-26T22:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising