ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర రాజా ప్లాంట్లలో ఉత్పత్తి పునఃప్రారంభం

ABN, First Publish Date - 2021-05-10T06:39:59+05:30

చిత్తూరు జిల్లాలోని రెండు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తిరిగి ప్రారంబించినట్టు అమర రాజా బ్యాటరీస్‌ తెలిపింది. కాలుష్య నియంత్రణ పాటించడంలేదనే పేరుతో నూనెగుండ్లపల్లి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని రెండు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తిరిగి ప్రారంబించినట్టు అమర రాజా బ్యాటరీస్‌ తెలిపింది. కాలుష్య నియంత్రణ పాటించడంలేదనే  పేరుతో నూనెగుండ్లపల్లి, కారకంబాడి ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపి వేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) గత నెల 30న నోటీసులు జారీ చేసింది. దీన్ని కంపెనీ ఏపీ హైకోర్టులో సవాల్‌ చేయగా  హైకోర్టు ఈ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. దీంతో శనివారం నుంచే ఈ ప్లాంట్లలో ఉత్పత్తి తిరిగి ప్రారంభించినట్టు అమరారాజా తెలిపింది. కాలుష్య నియంత్రణ నిబంధనలు, కార్మికుల భద్రతా ప్రమాణాల విషయంలో ఏపీపీసీబీ నిబందనలు ముందు ముందు కూడా తుచ తప్పకుండా పాటిస్తామని ప్రకటించింది. కొద్ది రోజుల పాటు ఉత్పత్తి నిలిచి పోయినా ఆ ప్రభావం కంపెనీ వ్యాపారంపై ఏ మాత్రం లేదని తెలిపింది. 


Updated Date - 2021-05-10T06:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising